Business Ideas: ప్రస్తుత కాలంలో రైతే రాజు అనే మాట తిరిగి నిజం అవుతోంది. అవును లక్షలు తెచ్చిపెట్టే ఉద్యోగాలను వదిలేసి చాలా మంది ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో తిరిగి వ్యవసాయం బాట పడుతున్నారు. పూర్వకాలం పద్ధతుల్లో సంపద సృష్టికి నడుం బిగిస్తున్నారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది రోజా పువ్వుల సాగు గురించే. అవును ఎవరైనా కేవలం ఎకరాకు రూ.70 వేల పెట్టుబడితో ఈ పూల సాగును ప్రారంభించవచ్చు. అయితే ఈ పంటకు ముందుగా కావాల్సింది సరైన వాతావరణం, మట్టి, మెుక్కల పెంపకం, సరైన పోషకాలను అందించటం అని చెప్పుకోవాలి.

దేశంలో రోజా పూలకు మంచి డిమాండ్ ఉంది. అనేక శుభకార్యాల్లో వీటిని విరివిగా ప్రజలు ఉపయోగిస్తుంటారు. రోజా పూల ఆకులకు మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఒత్తిడిని తగ్గించటానికి కూడా పనిచేస్తాయి. రోజా పూలను విడిగా మార్కెట్లో మంచి ధరకు అమ్ముకోవచ్చు. అలాగే వీటిని సెంటు తయారీలో వినియోగిస్తారు. ఈ పూల నుంచి నూనెను తీసి అధిక ధరకు విక్రయిస్తుంటారు. అలాగే రోజ్ వాటర్ వంటి సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఈ పూలను విరివిగా వాడుతుంటారు.
చాలా మంది రైతులు రంగురంగుల గులాబీలను పండిస్తుంటారు. గులాబీల పెంపకం రైతులకు అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా ఉంది. దేశంలో కర్ణాటక, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గులాబీ సాగు ప్రధానంగా జరుగుతోంది. మంచి పూల దిగుబడి కావాలంటే 18-30 డిగ్రీల ఉష్ణోగ్రత చాలా కీలకం. ప్రధానంగా ఇసుక నేలలు, ఎర్రమట్టి, మంచి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన స్లిట్ లోమ్ గులాబీ సాగుకు అనువైనవి.
ఒక్కసారి మెుక్కలు నాటితే ఏడాది పొడుగునా పంట దిగుబడిని రైతులు పొందవచ్చు. దీని వల్ల ఒక్కసారి పెట్టుబడితో దిగుబడి రూపంలో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మంచి దిగుబడితో రైతులు ఆశించిన లాభాలను పొందవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications