For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడేళ్లపాటు వొడాఫోన్ ఐడియా సీఈవోకు వేతనం జీరో

|

వొడాఫోన్ ఐడియా (VI) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) రవీందర్ టక్కర్‌కు మూడేళ్ల పాటు ఎలాంటి వేతనం లేదా రెమ్యునరేషన్ ఉండదు. ఈ మేరకు రవీందర్ టక్కర్‌కు మూడేళ్ల సర్వీసు కాలంలో ఎలాంటి వేతనం చెల్లించకూడదని ప్రతిపాదనను తెచ్చింది. టక్కర్‌కు సంబంధించిన ప్రయాణ, బస, వినోద తదితర అన్ని రకాల ఖర్చులను మాత్రం కంపెనీ భరిస్తుంది. అదే విధంగా బోర్డు సమావేశాలు, ఇతర కమిటీల సమావేశాలకు పాల్గొన్న సమయంలోను ఎలాంటి ఫీజులు చెల్లించదు.

18లక్షలకోట్లు పెరిగింది: జెఫ్ బెజోస్, ఇండియన్ జైచౌదరి అదుర్స్, భారీగా తగ్గిన ట్రంప్ సంపద18లక్షలకోట్లు పెరిగింది: జెఫ్ బెజోస్, ఇండియన్ జైచౌదరి అదుర్స్, భారీగా తగ్గిన ట్రంప్ సంపద

రెమ్యునరేషన్ నిల్..

రెమ్యునరేషన్ నిల్..

రవీందర్ టక్కర్ నియామకం సహా ఇతర ప్రతిపాదనలకు ఈ నెల 30వ తేదీన నిర్వహించే కంపెనీ 25వ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల ఆమోదం కోరనుంది. ఈ మేరకు షేర్ హోల్డర్స్‌కు ఇచ్చిన నోటీసులో వొడాపోన్ ఐడియా పేర్కొంది. గత ఏడాది బాలేష్ శర్మ అకస్మిక రాజీనామాతో రవీందర్ టక్కర్‌ను ఎండీ, సీఈవోగా మూడేళ్ల కాలానికి కంపెనీ నియమించింది. 2019 ఆగస్ట్ 19వ తేదీ నుండి ఆయన నియామకం అమల్లోకి వచ్చింది. బాలేష్ శర్మకు ఆయన పదవీకాలంలో రూ.8.59 కోట్ల వేతనాన్ని చెల్లించింది. అతనికి నిల్ రెమ్యునరేషన్ ఉండనుంది.

ఆర్థిక చిక్కుల్లో వొడాఫోన్ ఐడియా

ఆర్థిక చిక్కుల్లో వొడాఫోన్ ఐడియా

రుణాలను రూ.25,000 కోట్ల నుండి రూ.1 లక్ష కోట్లకు పెంచుకునేలా షేర్ హోల్డర్స్ అనుమతిని కోరనుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ ప్రయివేటు రంగ టెలికం ఏజీఆర్ బకాయిలతో ఇబ్బందులు పడుతోంది. అలాగే గత కొంతకాలంగా కస్టమర్లను కోల్పోతోంది. కంపెనీ మనుగడ కోసం నిధుల సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ రుణాలు 2016-17 నాటికి రూ.58,250 కోట్లు ఉన్నాయి. ఇందులో రూ.7,854 కోట్లు చెల్లించింది. మరో రూ.50వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.

43 కోట్ల నుండి 30 కోట్లకు కస్టమర్లు

43 కోట్ల నుండి 30 కోట్లకు కస్టమర్లు

2018 నాటికి వొడాఫోన్ ఐడియా 43 కోట్లమంది సబ్‌స్క్రైబర్లతో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ సంస్థ వినియోగదారుల సంఖ్య 30.9 కోట్లకు తగ్గిపోయింది. వొడాఫోన్ ఐడియా ఇటీవల కొత్త బ్రాండ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం కీలక ప్రకటన రానుందని వార్తలు రావడంతో ఓ సమయంలో షేర్ 10 శాతం పెరిగింది. అయితే కేవలం బ్రాండ్ పేరు విడుదల చేయడంతో షేర్ వ్యాల్యూ పడిపోయింది. ఈ రోజు దాదాపు 1 శాతం క్షీణించింది.

English summary

మూడేళ్లపాటు వొడాఫోన్ ఐడియా సీఈవోకు వేతనం జీరో | No remuneration for Vodafone Idea CEO during 3 year tenure

Vodafone Idea managing director and chief executive officer Ravinder Takkar will not be given any remuneration during his current tenure of three years, according to a proposal by the company.
Story first published: Wednesday, September 9, 2020, 18:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X