ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మే 13) మీడియాకు వివరించారు. సమాజంలోని వివిధ వర్గాలతో చర్చించాక విజన్ రూపొందించినట్లు చెప్పారు. ప్రధాని మోడీ మార్గనిర్దేశనం చేశారన్నారు. దేశ ఆర్థిక వృద్ధిని పెంచి స్వయం సమృద్ధి దిశగా భారత్‌ను నడిపేందుకు ఈ ప్యాకేజీ అన్నారు. భారత్ స్వయంపూర్వకంగా ఎదగడమే లక్ష్యమన్నారు. ఒక్కో రంగానికి ఏ చర్యలు తీసుకున్నది రోజుకొకటి ప్రకటిస్తామని, ఈ రోజు MSMEలపై ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
మెగా ప్యాకేజీలో ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ రుణాలకు కేంద్రం గ్యారెంటీగా ఉంటుందన్నారు. పూచీకత్తు లేకుండా 12 నెలల మారటోరియంతో రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ లేదా వ్యాపారాలు కోలుకునే వరకు వెసులుబాటు కల్పిస్తున్నారు. తద్వారా ఈ రంగంలోని ఉద్యోగాలు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం అని చెప్పారు. ఈ రుణ సదుపాయం అక్టోబర్ వరకు ఉంటుందన్నారు. నాలుగేళ్లలో తిరిగి చెల్లించేలా 12 నెలల మారటోరియం ఉంటుందన్నారు.

ఆర్థిక, మౌలిక, సాంకేతిక, జనాభా, డిమాండ్ ఈ ఐదు మూలసూత్రాల ఆధారంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పైన ప్రధాని ప్రకటించారన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయడం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ 40 రోజుల్లో భారత్ ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. గత 40 రోజులుగా పీపీఈలు, వెంటిలెటర్లు స్వదేశంలో తయారు చేస్తున్నామన్నారు. ఇప్పుడు మన సొంత ఉత్పత్తులను ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్నారు.
ఇండియా స్వావలంభన కోసం ఈ ఆర్థిక ప్యాకేజీ అన్నారు. స్వీయ ఆధారిత భారతం పేరుతో ఈ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా నగదు బదలీ వంటి సంస్కరణలు ఫలితాలను ఇచ్చాయన్నారు. మొబైల్ బ్యాంకింగ్, జన్ ధన్ అకౌంట్స్‌తో దేశంలో విప్లవం వచ్చిందన్నారు. గత ఐదున్నరేళ్లుగా ఎన్నో సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఎఫ్‌డీఐ నిబంధనలు సులభతరం చేసి పెట్టుబడులు వచ్చేలా చేశామన్నారు. భూమి, నగదు లభ్యత, పాలనాపరమైన విధానాలే కీలకం అన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications