కొత్త ప్రమాణాల ప్రకారం జూలై నుండి ఎంఎస్ఎంఈల వర్గీకరణ
దేశంలోని ఆరుకోట్లకు పైగా ఉన్న మైక్రో, స్మాల్ అండ్ మధ్యతరహా కంపెనీలు జూలై నుండి ప్రభుత్వం ఆమోదించిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా లిస్ట్ చేయబడుతాయి. సవరించిన ప్రమాణాల ప్రకారం రూ.50 కోట్ల ఖర్చు, రూ.250 కోట్ల టర్నోవర్ కలిహగిన సంస్థ మీడియం వ్యాపారంలోకి వస్తుంది. రూ.1 కోటి పెట్టుబడి కలిగి రూ.5 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థ మైక్రో కేటగిరీలోకి, అలాగే, రూ.10 కోట్ల పెట్టుబడి, రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌గా వర్గీకరిస్తారు.
ఇప్పుడు తయారీ,సేవా పరిశ్రమల మధ్య తేడా ఉండదు. ఈ కొత్త మార్గదర్శకాలు ఎంఎస్ఎంఈలను మెరుగుపరిచేందుకు, మరింత విస్తరించేందుకు ఉపయోగపడతాయని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. వాస్తవానికి ఎంఎస్ఎంఈల ఎగుమతులను టర్నోవర్ లెక్కింపు నుండి మినహాయించాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈ నెట్ వర్క్ యొక్క ప్రయోజనాలు కోల్పోకుండా ఎంఎస్ఎంఈలు మరింత ఎక్కువగా ఎగుమతి చేసే వీలు కల్పిస్తుంది.

దీంతో ఎగుమతిరంగం గణనీయంగా పెరుగుతుందని అంచనా. అదే జరిగితే వృద్ధి పెరుగుతుందని, ఆర్థికంగా బలపడుతుందని, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఎంఎస్ఎంఈ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా సవరణలకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) ఆమోదం తెలిపింది.
ఎంఎస్ఎంఈడీ యాక్ట్, 2006 ప్రకారం ఉన్న ప్రమాణాలు తయారీ, సేవా విభాగాలకు భిన్నంగా ఉంటాయి. ఆర్థిక పరిమితులపరంగా కూడా బలహీనంగా ఉందని చెబుతున్నారు. మే 13, 2020 ఆర్థిక ప్యాకేజీ ఆధారంగా చేసిన ప్రకటనకు తోడు మరిన్ని సవరణలు జరగవచ్చునని చెబుతున్నారు. కాగా, భారత స్థూల జాతీయోత్పత్తిలో ఎంఎస్ఎంఈల వాటా 29 శాతం వరకు ఉంటుంది. ఎగుమతుల్లో సగం ఇవే భర్తీ చేస్తాయి. వీటిలో 11 కోట్లకు పైగా కార్మికులు పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications