కరోనా మహమ్మారి కారణంగా ఆర్బీఐ గత శుక్రవారం కీలక ప్రకటనలు చేసింది. అదే విధంగా కొన్ని నిధులు కూడా ప్రకటించింది. రెండోసారి ఆర్బీఐ ప్రకటించిన నిర్దేశిత దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ (TLTRO) దేశంలోని MSMEలకు కలిసి రానుంది. ఈ చర్యల్లో భాగంగా ఆర్బీఐ.. బ్యాంకులకు రూ.50,000 కోట్లు TLTRO కింద సమకూరుస్తుంది. మరో రూ.50,000 కోట్లు నాబార్డ్, NHB వంటి రీఫైనాన్స్ సంస్థలకు సమకూరుస్తుంది.

అలా నిధుల కొరత తీరుతుంది
ఈ రుణాల కాలపరిమితి మూడు సంవత్సరాలు. రెపో రేటుకే ఆర్బీఐ ఈ రుణాలు అందిస్తుంది. బ్యాంకులకు అందే రూ.50,000 కోట్ల TLTRO నిధుల్లో కనీసం సగం నిధులను పెద్దగా పరపతి రేటింగ్ లేని NBFC, IFI, HFCల రుణ పత్రాల్లో బ్యాంకులు మదుపు చేయాలి. లేదంటే ఆర్బీఐ మిగతా నిధులపై రివర్స్ రెపో రేటు కంటే 2 శాతం అధిక వడ్డీ రేటును వసూలు చేస్తుంది. దీంతో NBFCల నుంచి SMSEలకు రుణాలు పెరిగి నిధుల కొరత తీరే అవకాశముంటుంది.

MSMEలకు ఉపశమనం
2018లో ఐఎల్ఆండ్ఎఫ్ఎస్‌లో భారీ అవకతవకలు బయటపడ్డాక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ద్రవ్య లభ్యత తగ్గింది. ఆర్బీఐ తాజా ఉద్దీపనతో కాస్త ఉపశమనం లభించింది. రూ.1 లక్ష కోట్ల ఉద్దీపనకు ఆర్బీఐ మొగ్గు చూపినట్లుగా విశ్లేషకుల అంచనా. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో ఆర్బీఐ కొత్త TLTRO కింద రూ.50,000 కోట్లను వ్యవస్థలోకి జొప్పించింది. ఇందులో 50 శాతం మొత్తాన్ని NBFC, IFI, HFCలకు రుణాలుగా అందించడం తప్పనిసరి చేసింది. మరో రూ.50వేల కోట్లతో నాబార్డ్, సిడ్బీ, ఎన్‌హెచ్‌బీలకు ప్రయోజనం కలిగేలా రీఫైనాన్స్ విండోను ప్రారంభించింది.

స్వాగతిస్తున్న కంపెనీలు
ఆర్బీఐ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, ఎంఫిన్, ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్సుపోర్ట్ ఫైనాన్స్ సంస్థలు పేర్కొన్నాయి. అయినప్పటికీ ఆర్థిక రంగం పుంజుకోవాలంటే మరిన్ని నిధులు కావాలని నిపుణుల అంచనా.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications