సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఊరట ప్రకటన చేశారు. బ్యాంకులు కారణం లేకుండానే రుణాల్ని మంజూరు చేయకుంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదలన గురించి ట్రేడర్స్‌కు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈలకు పై సూచన చేశారు.

కారణం లేకుండా రుణాలు మంజూరు చేస్తే ఫిర్యాదు
ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు ఎలాంటి కారణం లేకుండా రుణం మంజూరు చేయకుంటే తమకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఫిర్యాదు చేసినప్పుడు సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు కూడా ఓ కాపీని పంపించాలని చెప్పారు. రుణాలు నిరాకరించిన ఉద్యోగిపై సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు ఉండాలన్నారు.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెంటర్
ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ప్రజలు బ్యాంకులను సంప్రదించినప్పుడు హేతుబద్ద కారణం లేకుండా బ్యాంకులు నిరాకరించలేవన్నారు. అలా నిరాకరిస్తే ఫిర్యాదు చేసేందుకు త్వరలో ఆర్థిక శాఖ ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలో ఎంఎస్ఎంఈల పునాదులు బలంగా ఉన్నాయని చెప్పారు. మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన వల్ల ప్రభుత్వానికి ఆస్తులు సృష్టించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు.

అందుకే విదేశీ మారకనిల్వలు ఎక్కువగా ఉన్నాయి
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలు అభివృద్ధి చెందే విధంగా ఉందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మూలాలు బాగున్నందునే విదేశీ మారకం నిల్వలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్నారు. గతంలో బ్యాంకులు తమ సంబంధీకులకు ఫోన్ బ్యాంకింగ్ ద్వారా రుణాలు మంజూరు చేశాయని, దీంతో నిరర్ధక ఆస్తులు ఎక్కువస్థాయిలో పెరిగాయని తెలిపారు.

నాలుగేళ్లు పట్టింది
నిరర్థక ఆస్తులను పరిష్కరించేందుకు నాలుగేళ్లు పట్టిందన్నారు. గతంలో జరిగిన ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు మంచి పాఠాలు నేర్చుకున్నామని, అనవసరమైన ఖర్చులను ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని చెప్పారు. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల ద్వారా ఆస్తులు సృష్టించేందుకు నిర్ణయించిందన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications