Business Ideas: పండుగ సీజన్‌లో పక్కా ఆదాయం.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..!
Business Ideas: పండుగల సీజన్ ప్రారంభం అయ్యింది. ఇంటి వద్దే ఉంటూ ఏదైనా అదనపు ఆదాయం కావాలనుకునేవారికి ఇది సరైన సమయం. అలాగే చిన్న ఉద్యోగం చేసుకుంటూ అదనపు ఆదాయం కావాలనుకునే వారు సైతం దీనిని ప్రారంభించొచ్చు.
పండుగల సీజన్ లో పక్కాగా ఆదాయం తెచ్చేపెట్టే వ్యాపారం ఒకటి ఉంది. అదే గిఫ్ట్ బాస్కెట్ల తయారీ బిజినెస్. మహిళలు తమ ఇంటి నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. అలా తమ ఖాళీ సమయాన్ని వారు అదనపు ఆదాయాన్ని సంపాదించటం కోసం సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందులో రకరకాల బహుమతులను ఇచ్చేందుకు ఉపయోగించే బుట్టలను తయారు చేయాల్సి ఉంటుంది. ఇవి ప్రజలు తమ ప్రియమైన వారికి అందించే బహుమతులను మరింత అందంగా కనిపించేలా చేస్తాయి.

రకరకాల డిజైన్లు, రంగుల్లో వినూత్నంగా బుట్టలను తయారు చేయటం ద్వారా లాభాన్ని పొందొచ్చు. కార్పొరేట్ కంపెనీల నుంచి బయట గిఫ్ట్ షాపుల వరకు అందరూ వీటిని ప్రస్తుత కాలంలో విరివిగా వినియోగిస్తున్నారు. ఇందుకోసం చాలా తక్కువగా అంటే రూ.5 నుంచి రూ.10 వేలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. మీకు దగ్గరలోని గిఫ్టింగ్ షాప్స్ ను సంప్రదించి వారి అవసరాలకు అనుగుణంగా బుట్టలను తయారు చేసి సులువుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలాగే వీటిని ఆన్‌లైన్‌లో అమెజాన్, ఫిప్‌కార్ట్, మీషో వంటి వేదికల ద్వారా కూడా అమ్ముకోవచ్చు.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు గిఫ్ట్ బాస్కెట్ లేదా బాక్స్ రిబ్బన్, ప్యాకేజింగ్ మెటీరియల్, ప్యాకింగ్ కాగితం, స్థానిక ఆర్ట్ క్రాఫ్ట్ వస్తువులు, మార్కర్ పెన్నులు, పేపర్ ష్రెడర్, కార్టన్ స్టెప్లర్, డెకరేటివ్ మెటీరియల్, స్టిక్కర్లు, ఫాబ్రిక్ ముక్కలు, సన్నని తీగ, కత్తెరలు, వైర్ కట్టర్లు, కలరింగ్ టేప్ వంటి ప్రాథమిక వస్తువుల అవసరం ఉంటుంది. వీటిని వినియోగించి నేరుగా మీరే గిఫ్ట్స్ వ్యాపారాన్ని ఆన్ లైన్ పద్ధతిలో ఇంటి నుంచే ప్రారంభించొచ్చు. మెటీరియల్ కాస్ట్ తప్ప అదనంగా ఎలాంటి ఖర్చులు మీకు ఉండవు.


Click it and Unblock the Notifications