Business Ideas: ఇంట్లో నుంచే డబ్బు సంపాదించాలనుకునే వారికి ఈ రోజుల్లో మంచి ఆదాయ మార్గాలు ఉన్నాయి. పైగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించే వీటికి నష్టాలు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువనే చెప్పుకోవాలి. పైగా వీటికి నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎక్కడి నుంచైనా సంపాదించుకునేందుకు అవకాశం ఉంది.
ముందుగా టెర్రస్ ఫార్మింగ్ గురించి తెలుసుకున్నట్లయితే.. ఇక్కడ ఇంటి పైకప్పు అంటే.. డాబా మీద వ్యవసాయం చేయడం చాలా పాపులర్ అయ్యింది. దీని ద్వారా క్రిమిసంహారకాలు, రసాయనాలు లేని ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలను పండించి మంచి ధరలకు విక్రయించుకోవచ్చు. ఇందుకోసం అనేక గార్డెనింగ్ టెక్నిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ఇంటి పైకప్పుపై పాలీబ్యాగ్‌లో కూరగాయల మొక్కలను నాటాలి. టెర్రస్ గార్డెనింగ్‌లో ఆదాయం భవన స్థలంపై ఆధారపడి ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో మెుక్కలకు అవసరమైన నీటిని అందించవచ్చు. సూర్యరశ్మి మంచిగా పడేలా ఉంటే సరిపోతుంది.

సోలార్ ప్యానెల్స్‌ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా కూడా డబ్బును సంపాదించుకోవచ్చు. ఇంటిపై సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా.. కరెంటు బిల్లును ఆదా చేసుకోవటంతో పాటు.. పెద్ద మెుత్తంలో డబ్బును సంపాదించుకోవచ్చు. నేరుగా విద్యుత్ సంస్థలు మీరు తయారు చేసిన విద్యుత్ నెట్ మీటరింగ్ పద్ధతిలో కొనుగోలు చేసి డబ్బు చెల్లిస్తాయి. దేశంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం దృష్ట్యా ప్రభుత్వం సైతం దీనిని ప్రోత్సహిస్తోంది. అయితే ఇందుకోసం ప్రారంభంలో ఎక్కువ మెుత్తాన్ని పెట్టుబడిగా వెచ్చించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం దేశంలో మెుబైల్ కమ్యూనికేషన్ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఇందు కోసం కంపెనీలు కొత్తగా 5జీ టవర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలో మీరు ఇంటిపై మెుబైల్ సెల్ టవర్ ఏర్పాటుకు కంపెనీలకు అద్దెకు ఇవ్వటం ద్వారా కూడా మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఇందుకోసం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోవాలి. మీరు ఇంట్లో మొబైల్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే.. మీరు నేరుగా మొబైల్ కంపెనీలను లేదా టవర్ ఆపరేటింగ్ కంపెనీలను సంప్రదించవచ్చు.
చివరగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు ఇంటిపై హోర్డింగులకు స్థలం అద్దెకు ఇచ్చి కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. దీని కోసం మీరు సదరు ఏజెన్సీని సంప్రదించి వారితో చర్చించవచ్చు. మీ ఇల్లు ఉన్న ప్రాంతాన్ని బట్టి మీకు చెల్లించే అద్దె నిర్ణయించబడుతుంది. మంచి కమర్షియల్ ఏరియాలో బిల్డింగ్ ఉన్నట్లయితే మంచి ఆదాయాన్ని సులువుగా పొందవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications