Business Ideas: ప్రస్తుత కాలంలో చాలా బాగా చదువుకుని, అనేక డిగ్రీలు ఉన్న వ్యక్తులు సైతం తక్కువ సంపాదిస్తున్నారు. మరో పక్క కొందరు టెక్కీలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూనే అదనపు ఆదాయం కోసం వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో మనం 60 లలోనూ తన వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్న నవల్బెన్ దల్సంగ్‌భాయ్ చౌదరి అనే మహిళ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. జీవితంలో ఎప్పుడూ పాఠశాలకు కూడా హాజరుకాని ఆమె కేవలం పట్టుదల, కృషితో లక్షలు గడిస్తున్నారు. రిటైర్మెంట్ వయస్సులో విరామం లేకుండా తనపని తాను చేసుకుపోతూ స్పూర్తిగా నిలుస్తున్నారు.

బనస్కాంత జిల్లాకు చెందిన గుజరాతీ మహిళ నవల్బెన్ పాల వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సమాజంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా తన డైరీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ సిబ్బందిని మంచిగా చూసుకుంటున్నారు. మెుదట్లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, పట్టువీడక ముందుకు సాగారు. 2020,2021లో కోటి రూపాయలకు విలువైన పాలను విక్రయించి నెలకు దాదాపు రూ.3.5 లక్షలను సంపాదించారు.
2021లో ఆమెకు దాదాపు 45 ఆవులు, 80కి పైగా గేదెలు ఉన్నాయని సమాచారం. తాను సక్సెస్ అయిన తర్వాత సమీప గ్రామాలకు చెందిన ప్రజలకు సైతం ఆమె ఈ రంగంలో అవగాహన కల్పిస్తున్నారు. అందుకే మూడుసార్లు ఆమె జిల్లాలో ఉత్తమ 'పశుపాలక్' అవార్డును, మూడుసార్లు "లక్ష్మీ" అవార్డును అందుకున్నారు. అలా డెయిరీ రంగంలో చరిత్ర సృష్టిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతూ ఆధునిక ఉద్యోగాలు చేస్తున్న వారితో ఏ మాత్రం తగ్గకుండా సంపాదిస్తున్నారు. ఇది ఈ రంగంలో వ్యాపార అవకాశాలను పరిశీలించే వారికి చాలా స్పూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications