SunTv Shares: కళానిధి మారన్ తమిళనాట పరిచయం అవసరం లేని ప్రముఖ వ్యాపారవేత్త. సన్ టీవీ అధినేతగా ఉన్న ఆయన మాజీ సీఎం కరుణానిధికి బంధువు కూడా. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోవటంతో వార్తల్లో నిలిచారు.
అటు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును కలిగి ఉన్న మారన్.. ఇటీవల సూపర్ స్టార్ రజనీతో తీసిన జైలర్ సినిమాతో వార్తల్లో మారుమోగిపోయారు. తాను సినిమా నుంచి వచ్చిన లాభాలను ప్రాజెక్టులో పనిచేసిన అందరికీ పంచటంతో పాటు హీరో, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్లకు ఖరీదైన బహుమతులు, క్యాష్ రివార్డులు అందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ క్రమంలోనే మీడియా పరిశ్రమలో సౌత్ ఇండియాలో అగ్రగామి కంపెనీగా కొనసాగుతున్న సన్ టీవీ షేర్లు మూడు నెలల కాలంలో 40 శాతానికి పైగా పెరిగాయి.

ఈ పెరుగుదలతో సన్ టీవీ యజమాని కళానిధి మారన్ ఆస్తుల విలువ తారాస్థాయికి చేరుకున్నాయి. రానున్న 3-4 వారాల్లో సన్ టీవీ షేర్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది జూలై 5న రూ.443గా ఉన్న సన్ టీవీ షేరు ధర ఈరోజు 0.77 శాతం లాభపడి రూ.620.30 వద్ద కొనసాగుతున్నాయి. గడచిన 6 నెలల కాలంలో కంపెనీ షేర్లు 45 శాతం మేర రాబడిని అందించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.24,450 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ తరుణంలో వాల్డ్ డిస్నీ సంస్థ తన భారత టీవి, స్ట్రీమింగ్ వ్యాపార ఆస్తులను అమ్మేందుకు సన్ టీవీని సంప్రదించినట్లు వెల్లడైంది.
సన్ టీవీలో మారన్, అతని కుటుంబ సభ్యులకు 75 శాతం వాటాలు ఉండటంతో వారి సంపద తాజాగా భారీ పెరుగుదలను చూసింది. ఈ క్రమంలోనే సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కళానిధి మారన్ నికర విలువ దాదాపు 2.9 బిలియన్ డాలర్లకు చేరుకోవటంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 1031వ స్థానంలో నిలిచారు. 1990లో కళానిధి మారన్ కళానిధి మారన్ బూమలై అనే తమిళ మాసపత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత 1993లో టెలివిజన్ ఛానెల్‌ని ప్రారంభించటంతో దశ తిరిగింది. అలా తర్వాతి కాలంలో సినిమాల నిర్మాణాన్ని కూడా చేపట్టారు.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications