మీరు ఉద్యోగం చేసి అలిసిపోయారా.. సొంతంగా బిజినెస్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా.. జీతంతో బతకడం కన్నా సొంత వ్యాపారంలో సంపాదన సంతృప్తిని ఇస్తుందని భావిస్తున్నారా..మీరు ఇలా ఆలోచన చేయడం గొప్ప విషయమే.. వ్యాపారంలో సక్సెస్ కావాలని మీ ఆలోచన సరైనదే కావొచ్చు. కాని దానికి తగినంతగా ప్రణాళిక ఉండాలి. అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకోవాలి. వ్యాపారం చేయాలనుకునే వారికి పెద్ద సమస్య ఏంటంటే పెట్టుబడి..
పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయడం సాధ్యం కాదు.. అయితే పెట్టుబడి లోన్ రూపంలో తీసుకుంటే వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో ఆ లోన్ కట్టుకోవచ్చు. మరి లోన్ ఎవరిస్తారు..ఈ రోజుల్లో మనుషుల్ని నమ్మడమే కష్టంగా ఉంది. అలాంటి లోన్ ఇస్తామని ఎవరూ ముందుకు రారు. ఇలాంటి సందర్భంలో మీకు గొప్ప అవకాశం కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తోంది. అవును కేంద్రంలోని మోదీ సర్కారు..చిన్న చిన్న వ్యాపారుల కోసమే ముద్రా లోన్లు ( Micro Units Development and Refinance Agency) అందిస్తోంది. ఈ లోన్ సాయంతో మీరు వ్యాపారాన్ని ప్రారంభించి వృద్ధిలోకి రావొచ్చు.

అయితే మీరు ముందుగా ఏ బిజినెస్ చేయాలనే దానిపై ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. మీకు ఏ రంగంలో అనుభవం ఉందో ఆ రంగంలో మీరు వ్యాపారాన్ని నిర్వహిస్తే త్వరగా సక్సెస్ అవుతారు. మేమే మీకు ఉదాహరణగా ఓ వ్యాపారాన్ని అందిస్తున్నాం.. ఈ వ్యాపారాన్ని ఓ సారి చూడండి.. లేదా మీకు నచ్చిన వ్యాపారాన్ని ఎంచుకోండి.ముద్రా లోన్ కింద మోదీ సర్కారు మీకు రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణసాయాన్ని అందిస్తోంది. మీరు స్థానిక బ్యాంక్ అధికారుల్ని సంప్రదించి ఈ లోన్ పొందవచ్చు.
ప్రస్తుతం క్యాటరింగ్ వ్యాపారం అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యాపారం. అలాగే అత్యంత లాభదాయకమైన వ్యాపారం కూడా.. మీరు వంట చేయడంలో నేర్పరి అయితే మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. మీరు క్యాటరింగ్ చేయాలనుకుంటే ఎక్కువగా వస్తువులు కూడా ఏమీ అవసరం లేదు. గ్యాస్ స్టౌలు, పెద్ద పాన్‌లు, కుక్కర్లు ఉంటే సరిపోతాయి. వీటిని మీరు క్యాటరింగ్ ఆర్డర్ తీసుకున్న ప్రదేశానికి తీసుకువెళ్లేందుకు ఓ చిన్న వాహనం సరిపోతుంది. మీరు ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి అక్కడికి పంపేందుకు కూడా వాహనం అవపరమవుతుంది. కాబట్టి ఈ వ్యాపారంలో వాహనం అనేది చాలా తప్పనిసరిగా కావాలి.
ఇక మరొకటి బఫే సెటప్ సామాగ్రి..ఇప్పుడు అని కార్యాలకు ఈ సిస్టంనే కోరుకుంటున్నారు.. అక్కడికి వెళ్ళి ప్రిపేర్ చేయడం కన్నా ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకుని అక్కడ బఫే సిస్టం ద్వారా భోజన కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. కాబట్టి ఈ సిస్టం క్యాటరింగ్ బిజినెస్ వాళ్ళకు ప్రధాన లాభదాయకమైనది. ఇందు కోసం మీకు కొన్ని అవసమవుతాయి. మీ కంపెనీలో పని చేసే వర్కర్లు అలాగే వాళ్లకు కంపెనీ యూనిఫాం.. బపే జరిగే చోట వారికి మౌలిక వసతులు అలాంటి అవసరమవుతాయి.
ఈ వ్యాపారానికి మీరు ప్రభుత్వం ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే FSSAIలో నమోదు చేసుకోవాలి. ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ద్వారా ఆహార వ్యాపారాలను నడిపే సంస్థలకు (Food Business Operator - FBO) జారీ చేయబడిన ఒక పత్రం. ఈ సర్టిఫికేట్ ఆహార వ్యాపారాలు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని నిర్ధారిస్తుంది. FSSAI లైసెన్స్..మీరు చేసే క్యాటరింగ్ బిజినెస్ నిర్దిష్ట భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అని నిర్థారిస్తుంది. మీరు ఆహార వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నిర్వహించడానికి ఇది చట్టపరమైన అనుమతిలాంటిది.
ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ లో కొన్ని రకాలు ఉంటాయి. ప్రాథమిక లైసెన్స్ విషయానికి వస్తే.. సంవత్సరానికి 12 లక్షల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న FBOలు. ఇది క్యాటరింగ్ బిజినెస్ వారికి సరిపోతుంది. ఇక రాష్ట్ర స్థాయిలో లైసెన్స్ అంటే సంవత్సరానికి 12 లక్షల నుండి 20 కోట్ల మధ్య టర్నోవర్ ఉన్న FBOలు కావాలి. అలాగే సెంట్రల్ లైసెన్స్ విషయానికి వస్తే.. సంవత్సరానికి 20 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న FBOలు అవసరమవుతాయి.
ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. మీరు ముందుగా FSSAI వెబ్‌సైట్‌ను సందర్శించి, FoSCoS (Food Safety Compliance System) పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.అక్కడ మీరు కొత్త లైసెన్స్/రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయండి, లేదంటే లైసెన్స్/రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించండి లేదా మార్చండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. అక్కడ అడిగే రుసుము చెల్లించండి.
అన్ని అయిపోయాక మీ దరఖాస్తును సమర్పించండి. పూర్తయిన తరువాత ఫైల్ నంబర్‌ను నోట్ చేసుకోండి.
మీరు ఫైల్ నంబర్‌ను ఉపయోగించి మీ దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయవచ్చు.లైసెన్స్ వచ్చిన తరువాత మీరు FSSAI వెబ్‌సైట్‌లో లైసెన్స్ నంబర్‌ను తనిఖీ చేయవచ్చు. లైసెన్స్ స్థితి, చెల్లుబాటు, వ్యాపార పేరు, చిరునామా మొదలైనవి చూడవచ్చు. మీరు క్యాటరింగ్ బిజినెస్ ప్రారంభించే ముందు ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందడం తప్పనిసరి.అలాగే మీరు మీ లైసెన్స్‌ను గడువులోపు పునరుద్ధరించాలి. మీరు FSSAI వెబ్‌సైట్‌లో లైసెన్స్ నంబర్‌ను తనిఖీ చేయవచ్చు
ఇక మరో ముఖ్యమైన అంశం లోన్..దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. మీకు సమీపంలోని స్టేట్ బ్యాంక్, బాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులకు వెళ్లి ముద్ర లోన్ అడగాలి. లేదా www.mudra.org.in వెబ్‌సైట్‌ల ద్వారా అప్లై చేయవచ్చు, బ్యాంకులో మీరు ముద్రా లోన్ గురించి అడిగితే వారు మీ అర్హతకు తగిన విధంగా లోన్ మంజూరు చేస్తారు. మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆడ్రెస్ ప్రూఫ్, అలాగే మీ బిజినెస్ ప్లాన్, మీ బ్యాంక్ స్టేట్మెంట్ వంటి వివరాలు లోన్ తీసుకునే సమయంలో సబ్ మిట్ చేయాలి.
మీరు అన్న వివరాలు కరెక్ట్ గా సబ్ మిట్ చేసిన తర్వాత బ్యాంక్ వారు మీ డాక్యుమెంట్లను పరిశీలించి లోన్ మంజూరు చేస్తారు. లోన వచ్చిన తరువాత సాధారణంగా 8% - 12% వరకు వడ్డీ ఉంటుంది. ఇది బ్యాంక్ ఆధారంగా మారవచ్చు. 3 - 5 ఏళ్ల రీపేమెంట్ టెర్మ్ ఉంటుంది. లేదా 6 నెలల టైం పిరియడ్ కూడా ఉంటుంది. మీరు మీ సదుపాయాన్ని బట్టి పేమెంట్ సెటిల్ చేసుకోవచ్చు. దీనికి Collateral security (తాకట్టు లేదా సెక్యూరిటీ) అవసరం లేదు. ప్రభుత్వం నుంచి కేవైసీ ఆధారంగా వేగంగా రుణం మంజూరు చేయబడుతుంది.
ముద్ర లోన్ రకాలవారీగా చూస్తే.. చిన్న స్థాయి క్యాటరింగ్ ప్రారంభించేవారికి శిశు (Shishu) పథకం కింద రూ.50,000 వరకు రుణం లభిస్తుంది. మధ్య స్థాయి క్యాటరింగ్ సేవల కోసం కిషోర్ (Kishor) పథకం కింద రూ.50,000 - రూ.5 లక్షల వరకు రుణం, అలాగే బఫే/ఈవెంట్ క్యాటరింగ్, వాహన సేవలతో విస్తరించాలనుకునేవారికి తరుణ్ (Tarun) పథకం కింద రూ.5 లక్షలు - రూ.10 లక్షల వరకు రుణం లభిస్తుంది.
క్యాటరింగ్ బిజినెస్ ఆదాయం ఎలా ఉంటుందంటే.. చిన్న ఫంక్షన్ల కోసం ఆర్డర్ తీసుకుంటే రూ. 5,000 - రూ. 25,000 వరకు మీరు ఛార్జ్ చేయవచ్చు. నెలకు 10-15 ఆర్డర్లు వచ్చినా రూ. 1 లక్ష వరకు ఆదాయం పొందవచ్చు. ఇక పెళ్లిళ్లు, కార్పొరేట్ ఈవెంట్లు ఉంటే మీకు లక్షలలో ఆదాయం రావొచ్చు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications