హైదరాబాద్: అఖండ మెజార్టీతో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చిరు వ్యాపారులకు తొలి కానుక అందజేయనుంది. రూ.1.5 కోట్లు (కోటిన్నర) కంటే తక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారులందరికీ ఉచితంగా జీఎస్టీ-బిల్లింగ్ సాఫ్టువేర్‌ను అందించనుంది.

మోడీ ప్రభుత్వం ఉపశమనం
గత ప్రభుత్వంలో హడావుడిగా జీఎస్టీని అమలు చేసి అటు వ్యాపారులను, ఇటు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేసిన ఎన్డీయే ప్రభుత్వం, ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లుగా కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు చేసినా ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టడంతో.. ఈ అంశాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న వారందరికీ ఉపశమనం కల్పించాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

మోడీ నిర్ణయం
అందుకే ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు మోడీ ఉచిత సాఫ్టువేర్ అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా అకౌటింగ్, బిల్లింగ్ సాఫ్టువేర్‌లు కొనుగోలు చేయాలంటే సుమారు రూ.20,000 నుంచి రూ.30,000 ఖర్చవుతుంది. ఇంకొన్ని కంపెనీలు నెలకు రూ.2,500 అద్దెతో సాప్టువేర్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇక నుంచి చిరు వ్యాపారులకు ప్రభుత్వం అందించే ఉచిత సాఫ్టువేర్ వల్ల వారు భారీగా లబ్ధి పొందనున్నారు.

8 రకాల జీఎస్టీ సాఫ్టువేర్స్
జీఎస్టీ పోర్టల్‌లోకి లాగిన్ అయి సంస్థ టర్నోవర్ రూ.1.5 కోట్ల కంటే తక్కువ ఉన్నట్లు డిక్లరేషన్ ఇస్తే 8 రకాల జీఎస్టీ సాఫ్టువేర్‌లు కనిపిస్తాయి. అందులో నుంచి ఆయా సంస్థలకు అనుకూలమైన దానిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సాఫ్టువేర్ క్లౌడ్ ఆధారితంగా పని చేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని లక్షలాది మంది వ్యాపారులకు లబ్ధి చేకూర్చే ఈ నిర్ణయం మోడీ ప్రభుత్వంపై ఆదిలోనే సానుకూల దృక్పథం ఏర్పడేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications