కరోనా వైరస్ వ్యాప్తి, ఆ తర్వాత లాక్ డౌన్ వంటి పరిణామాలతో చితికిపోయిన చిన్న కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. జీఎస్టీ రిటర్న్ లు ఫైల్ చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలకు, అసలు వ్యాపారమే జరగని సంస్థలకు ప్రభుత్వ నిర్ణయంతో భారీ వెసులుబాటు లభించనుంది. రూ 5 కోట్ల టర్నోవర్ లోపు ఉన్న కంపెనీలకు ఈ వెసులుబాటు లభిస్తుంది. ఇందులో చాలా కంపెనీలకు పూర్తింగా పెనాల్టీలు, వడ్డీ రద్దు కానుండగా... మరికొన్ని సంస్థలకు మాత్రం తగ్గింపు వడ్డీతో చెల్లింపులు జరిపే అవకాశం లభించనుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ తగ్గింపు వెసులుబాటు జులై 2017 నుంచి జనవరి 2020 వరకు సంబంధించిన అన్ని రకాల జీఎస్టీ రిటర్న్స్ కు వర్తిస్తాయి.

వాటికి పూర్తిగా మినహాయింపు...
రూ 5 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన చిన్న కంపెనీల్లో పన్ను కట్టాల్సిన అవసరం లేని సంస్థలన్నీ ఎటువంటి అపరాధ రుసుము, వడ్డీ లేకుండానే రిటర్న్ లను దాఖలు చేయవచ్చని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. అంటే నిల్ రిటర్న్ దాఖలు చేసే సంస్థలకు భారీ ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో పన్ను కట్టాల్సి ఉన్న కంపెనీలు మాత్రం ఒక్కో రిటర్న్ కు గరిష్టంగా రూ 500 (18% వడ్డీ తో కలిపి) కట్టాల్సి ఉంటుంది. ఈ విషయాన్నీ కూడా ఆర్థిక మంత్రి వెల్లడించారు. అయితే ఇందులో కూడా వడ్డీ భారం తగ్గిపోయింది. ఈ సంస్థలకు వడ్డీ ని 18% నుంచి 9% నికి కుదించారు. కాబట్టి రిటర్న్ లు దాఖలు చేసే సంస్థలు ఆ మేరకు తగ్గించిన వడ్డీని చెల్లిస్తే సరిపోతుంది.

వారికి మాత్రమే ...
ప్రస్తుతం ప్రభుత్వం ఇన్ని రకాల మినహాయింపులు ఇస్తున్నా... వాటిని వినియోగించుకోవాలంటే మాత్రం కొన్ని షరతులు కూడా విధించింది. జులై 1 నుంచి సెప్టెంబర్ 30 లోపు ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల పెండింగ్ జీఎస్టీ చెల్లింపులు, వడ్డీలు, పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే తగ్గించిన వడ్డీ, తగ్గించిన పెనాల్టీ, లేదా జీరో టాక్స్ లయబిలిటీ తో చిన్న కంపెనీలు తప్పనిసరిగా సెప్టెంబర్ 30 లోపు జీఎస్టీ రిటర్న్ లు దాఖలు చేయాలి. లేదంటే మొత్తం భారం పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు ప్రభుత్వం చిన్న సంస్థలకు మరో వెసులుబాటును కూడా కలిపిస్తోంది. రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలు జీఎస్టీ నమోదు రద్దు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఆయా సంస్థలు మళ్ళీ తమ జీఎస్టీ లైసెన్స్ పొందాలంటే మరో అవకాశం కల్పిస్తోంది. జూన్ 12 నాటికి రద్దయిన అన్ని రకాల జీఎస్టీ లైసెన్సులను సెప్టెంబర్ 30 లోపు తిరిగి పొందవచ్చని తెలిపింది.

సగం కూడా రాకపోవచ్చు...
ఇదిలా ఉండగా... కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ వసూళ్లు పెద్దగా వచ్చేలా కనిపించటం లేదు. ప్రభుత్వమేమో వీలైనంత అధిక మొత్తంలో జీఎస్టీ వసూళ్లు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వాస్తవిక పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో సగటు వసూళ్ళలో 45% మాత్రమే జీఎస్టీ రాబడి సమకూరినట్లు తెలుస్తోంది. అయితే, చిన్న కంపెనీలకు ప్రోత్సహం ఇస్తూ వాటిని జీఎస్టీ క్రమం తప్పకుండ చెల్లించేలా చేయటం ద్వారా వసూళ్ల ను గాడిలో పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు టాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. లేదంటే అసలుకే ఎసరు వచ్చేలా ఉందని, గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. సగటున నెలకు రూ 1 లక్ష కోట్ల జీఎస్టీ వసూలు జరగాల్సిన ఉండగా... ప్రస్తుతం రూ 40,000 కోట్ల నుంచి రూ 45,000 కోట్ల మేరకే రావటం గగనమైపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిల కోసం కేంద్ర ప్రభుత్వం అప్పు చేయనున్నట్లు సమాచారం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications