Business Ideas: పండు నుంచి బెరడు వరకు పైసలే.. ఖరీఫ్‌లో సాగు చేస్తే సిరుసే..
Business Ideas: దేశంలో సాంప్రదాయ పంటలకు పరిమితం కాకుండా రైతులు ఇప్పుడు ఔషధ మెుక్కల పెంపకం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఔషధ మొక్కలను సాగు చేసే వారికి అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఈ పంటలు రైతులకు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంటాయి.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది అశ్వగంధ పంట గురించి. రైతులు ఖరీఫ్ సీజన్లో పంట కింద దీనిని సాగుచేయవచ్చు. సెప్టెంబరు మాసం దీని సాగుతు అత్యంత అనుకూలమైనది. ఈ పంట ఇసుక నేలలు, నల్లమట్టి, ఎర్రమట్టి నేలల్లో పండుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనేక ఔషధ గుణాల కారణంగా ఈ మెుక్క పండ్లు, గింజలు, బెరడుకు మార్కెట్లో మంచి ధర ఉంది. 6 నెలల్లోనే దిగుబడిని అందుకోవచ్చు.

అశ్వగంధ ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సాంప్రదాయ పంటల కంటే 50 శాతం ఎక్కువ ఆదాయం ఉన్నందున ఉత్తర భారతదేశంలోని రైతులు అశ్వగంధను పెద్దఎత్తున సాగు చేయడం ఇటీవలి కాలంలో పెరిగింది. ఒక హెక్టారులో అశ్వగంధ సాగు చేయాలంటే 10-12 కిలోల విత్తనాలు కావాలి. ఈ విత్తనాలు 7-8 రోజుల్లో మొలకెత్తే దశకు వస్తాయి. ఆ తర్వాత వాటిని పొలాల్లో 5 సెంటీమీటర్ల ఖాళీ ఉండేలా నాటుకోవాలి. అలా పంట 160-180 రోజుల్లో కోతకు సిద్ధమై చేతికొస్తుంది.
అలా ఎకరాకు 250-300 కిలోల ఎండు వేర్లు, 80 కిలోల విత్తనాలను రైతులు పొందుతారు. ఈ పంట ఎకరా సాగుకు దాదాపు రూ.15 వేలు ఖర్చవుతుండగా.. ఎకరాకు రూ.30 నుంచి 40 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ మెుక్కలను దేశంలోని ఆంధ్రప్రదేశ్, కేరళ, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర , యూపీ, గుజరాత్ , పంజాబ్, జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లోని రైతులు ఇటీవల ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఎకరం స్థలంలో అశ్వగంధ సాగు ద్వారా సుమారు రూ.2.50 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications