ఈ 3 వ్యాపారాలకు ఫుల్ డిమాండ్, నష్టం అస్సలు రాదు తెలుసా..!

Business Ideas: మనలో చాలా మందికి ఏదైనా సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలి, చిన్నదైనా పర్లేదు సొంత కాళ్లపై నిలబడాలి అనే కోరిక బలంగా ఉంటుంది. ఎందుకో తెలియదు చాలా మంది నేటి యువత లక్షల ప్యాకేజీలను ఉద్యోగాల్లో అందుకుంటున్నప్పటికీ దానితో సంతృప్తి చెందటం లేదు. తమకంటూ ఒక ఐడెంటిటీ కాలావాలని, అందుకోసం చిన్నదైనా సరే సొంతంగా చేసే వ్యాపారం ఉండాలని అనుకుంటున్నారు.

ఈ క్రమంలో ప్రస్తుతం భారతదేశంలో చిన్నగా స్టార్ట్ చేసుకునే వ్యాపారాల గురించి వెతుకుతున్న వ్యక్తులకు ప్రస్తుతం ఇక్కడ మూడు అత్యుత్తమ ఎంపికలు ఉన్నాయి. ముందుగా జెరాక్స్ షాపు ఏర్పాటు చేసే వారికి ఈరోజుల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే షాపును స్టార్ట్ చేయటం కంటే ఎక్కడ దానిని స్టార్ట్ చేస్తున్నాం అన్నదే ముఖ్యం. వీటిని ఎక్కువగా డిగ్లీ, పీజీ కాలేజీలు లేదా ఇంజనీరింగ్ కళాశాల దగ్గర ఏర్పాటు చేయటం మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రాజెక్ట్ వర్కుల నుంచి రోజువారీ అవసరాల వరకు మెటీరియల్స్, నోట్స్ అంటూ నిరంతరం విద్యార్థులు అధికంగా ఫొటేస్టాట్ కాపీలను వినియోగిస్తుంటారు. అందువల్ల ఇక్కడ షాపు ఏర్పాటు చేయటం మంచి ఆదాయాలను అందిస్తుంది.

Do you know that these 3 businesses have full demand and no loss at all in India

ఇక మంచి వ్యాపారం కోసం వెతుకుతున్న వారికి ఉన్న రెండవ ఆప్షన్ ఎగ్ షాపు. కరోనా తర్వాతి నుంచి ప్రజల్లో ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెరిగింది. దీంతో చాలా మంది బలవర్థకమైన, ఆరోగ్యకరమైన ఆహారాల కోసం రోజువారీ మెనూలో చోటుకల్పిస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న పౌష్ఠికాహారం గుడ్లు. ప్రజలు ఎక్కువగా నివసించే కాలనీలకు సమీపంలో వీటిని ఏర్పాటు చేయటం మంచి రాబడిని తెచ్చిపెడుతుంది.

Do you know that these 3 businesses have full demand and no loss at all in India

ఇక అందరికీ చాలా బాగా తెలిసిన వ్యాపారాల్లో టీ షాపు కూడా ఒకటి. కార్పొరేట్ ఆఫీసులు, కార్యాలయాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీ బంక్ సిగరెట్స్ అమ్మే చిన్న షాపు కూడా నెలకు లక్షల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. రద్దీగా ఉండే కార్పొరేట్ ప్రాంతాల్లో చిన్న జాగాకు సైతం నెలకు వేలల్లో కొన్ని చోట్ల లక్షల్లో చెల్లించి షాపు యజమానులు వాటిని నిర్వహిస్తున్నారు. పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లో సైతం టేస్టీ టీ అందించే షాపులకు గిరాకీ, డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల పైన పేర్కొన్న వ్యాపారాలు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలుగా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తులు పరిశీలించవచ్చు.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+