AP News: డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త.. వడ్డీ రాయితీ..!!
Dwacra Loan: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే మహిళలకు అందించిన మరో మాట నిలబెట్టుకోవటానికి ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు డ్వాక్రా రుణాల గురించి కీలక ప్రకటన చేశారు. దీంతో లక్షల మంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని మహిళలకు కూటమి సర్కార్ శుభవార్త తెలిపింది. ఈ క్రమంలోనే మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాన్ని అందించటానికి రంగం సిద్ధం చేస్తోంది. పైగా ఇందులో రూ.50 వేలను రాయితీగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక్కడ శుభావార్త ఏమిటంటే రాయితీ సొమ్ము పోయిన తర్వాత మిగిలిన మెుత్తంపై మాత్రమే డ్వాక్రా మహిళలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు, తయారీ వంటి వ్యాపారాలు నిర్వహించే వారికి మాత్రం ఈ రుణాలను వడ్డీ లేకుండా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎస్సీ సామాజిక వర్గంలోని మహిళలను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయితీ సొమ్మును రుణాలు పొందిన మహిళలు చివర్లో మినహాయింపుగా అందుకుంటారు.

రుణాలను అందుకునే మహిళలు రెండేళ్ల నుంచి 5 ఏళ్ల కాలంలో తిరిగి చెల్లించేందుకు వెసులుబాటు కల్పించబడుతోంది. కొత్త రుణాలు ఎప్పటి నుంచి విడుదల చేస్తారనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. దీనికి ముందు ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం(PMFME), ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన (PMEGP) కింద అనుసంధానించాలని నిర్ణయించింది.
పైగా ఈ స్కీమ్ కింద తీసుకునే రుణాలపై 35 శాతం రాయితీని అందించాలని నిర్ణయించింది. అంటే ప్రతి రూ.లక్ష రుణంపై రూ.35,000 మినహాయింపును పొందుతారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ కింద మసాలా తయారీ యూనిట్లు, ఊరగాయలు, డిస్పోజబుల్ ప్లేట్స్, డెయిరీ, పౌల్ట్రీ, ప్యాకేజింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ రుణాలకు సంబంధించి ఇప్పటికే బ్యాంకర్లతో సమావేశం నిర్ణయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడిన ఈ స్కీమ్ తెలుగు రాష్ట్రాల్లో భాగా ప్రాచుర్యం పొందింది. పావలా వడ్డీకి రుణాలను పొందుతున్న డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు సాధికారత కోసం వాటిని వినియోగిస్తూ అదనపు ఆదాయాన్ని పొందేందుకు వ్యాపారాలు చేపట్టడానికి ఉపయోగిస్తుంటారు. కేంద్రం సైతం దీనిని లక్ పతి దీదీ పథకం కింద దేశంలో రూ.5 లక్షల వరకు రుణాన్ని అందించటంతో పాటు వారికి ఉపాధి అవకాశాలను కల్పించే శిక్షణను సైతం అందిస్తోంది.


Click it and Unblock the Notifications