ఉద్యోగం మానేసి వ్యాపారంలో అడుగు పెడుతున్నవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అయితే సరైన ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రతిరోజు మంచి సంపాదన వస్తుంది. అంతేకాదు వ్యాపారాన్ని పెంచుకుంటే వెళ్తే ఇంకా ఎక్కువ రాబడి పొందిచ్చు. ఉద్యోగం వద్దు వ్యాపారం ముద్దు అనే పాలసీని పాటించే వారిలో యువతనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన దేశంలో స్టార్ట్ అప్స్ కి మంచి ఆదరణ ఉంది.
ఉద్యోగం చేస్తే ప్రతినెల జీతం వస్తుంది, అది కూడా నెలంతా ఖర్చులకే సరిపోతుంది. కాని తెలివైన వ్యాపారంలో ఒక్కసారి పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే తరువాత లాభాలు వాటంతట అవే వస్తాయి. అలంటి బిజినెస్ ద్వారా సక్సెస్ అయిన వారిలో రాజన్న సిరిసిల్ల జిల్లా యువకుడు ఒకడు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన పల్లి మనోజ్ అనే 23 ఏళ్ల యువకుడు సొంత ఊర్లో ఉపాధి లేక గల్ఫ్ వెళ్ళాడు. అక్కడ 9 నెలలు మాత్రమే ఉపాధి ఉండడంతో మళ్లీ సొంతురికి వచ్చేసాడు. చిన్నప్పటి నుంచే ఒక మంచి హోటల్ పెట్టి సక్సెస్ కావాలనే ఆలోచన, కోరిక ఉండేదని మనోజ్ చెప్పారు.

గల్ఫ్ నుండి 9 నెలలకే తిరిగివచ్చిన మనోజ్ మనసులో ఎలా ఆయిన బిజినెస్ చేయాలనీ బలంగా అనుకున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరంలోని పలు రెస్టారెంట్లలో 2 సంవత్సరాల పాటు పని చేసి టేస్టీ ఫుడ్ తయారు చేసే మెలుకువలన్నీ నేర్చుకొని పని మొదులు పెట్టినట్లు మనోజ్ తెలిపారు.
తన దగ్గర సేవింగ్స్ చేసుకున్న డబ్బుతో సొంత ప్రాంతమైన వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో 'మాధురి కేఫ్' పేరుతో వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం రూ.2లక్షల 20 వేల పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు రోజుకు సుమారు రూ.3500 నుంచి రూ.4 వేల వరకు గిరాకీ ఉంటున్నట్లు మనోజ్ అన్నారు. తన దగ్గర ఒక్కసారి వచ్చి శాండ్విచ్,బర్గర్,పిజ్జాలు టెస్ట్ చూస్తే..మీరే మళ్ళీ మళ్ళీ 'మాధురి కేఫ్' కు వస్తారనే చెబుతున్నాడు మనోజ్. స్పెషల్ ఆర్డర్ మీద కూడా పిజ్జా,బర్గర్,శాండ్విచ్,పావ్ బజ్జి తయారు చేసి ఇస్తానని కూడా చెప్పారు.
చదువు విషయంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ మధ్యలోనే ఆపివేసి..హోటల్ మేనేజ్మెంట్ చేసి ఫుడ్ బిజినెస్ ఉపాధిగా మార్చుకొని 'మాధురి కేఫ్' ఏర్పాటు చేసి, పట్టణంలో కస్టమర్స్ టెస్ట్ కి అనుగుణంగా తయారు చేసి సకాలంలో అందిస్తున్నట్లు మనోజ్ చెప్పారు. టెస్ట్ చూసిన కస్టమర్స్ చాలా బాగుందని మెచ్చుకున్నారని కూడా తెలిపారు. ఈ కేఫ్‌ను మరింత సక్సెస్ చేసి మిగతా ప్రాంతాల్లో కూడా..ఫ్రాంచైజ్ లాగా ఇచ్చేందుకు ప్లాన్స్ ఉన్నట్లు మనోజ్ వివరించారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..



Click it and Unblock the Notifications