బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ (BRICS) కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన ప్రభావాన్ని క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ దేశాలు బంగారాన్ని కీలక వ్యూహాత్మక ఆస్తిగా మార్చుకుంటున్నాయి. అధికారికంగా బ్రిక్స్ దేశాల వద్ద ప్రపంచ బంగారు నిల్వల్లో సుమారు 20 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, బ్రిక్స్‌కు అనుబంధంగా ఉన్న దేశాలతో కలిసి చూస్తే.. ప్రపంచ బంగారం ఉత్పత్తిలో దాదాపు 50 శాతం వరకు వీటి నియంత్రణలోనే ఉంది.
ఈ బంగారు ఉత్పత్తి వ్యూహానికి రష్యా, చైనా ముందువరుసలో ఉన్నాయి. 2024లో చైనా 380 టన్నులు, రష్యా 340 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేశాయి. సెప్టెంబర్ 2025లో బ్రెజిల్ 16 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇది 2021 తర్వాత బ్రెజిల్ చేసిన తొలి Gold కొనుగోలు. ఇది బ్రిక్స్ దేశాలు బంగారం విషయంలో ఎంత దూకుడుగా ముందుకు వెళ్తున్నాయో స్పష్టంగా చూపిస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్రిక్స్ దేశాలు రెండు దిశల్లో పనిచేస్తున్నాయి. ఒకవైపు ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తున్నాయి. 2020 నుంచి 2024 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారంలో 50 శాతం కంటే ఎక్కువ బ్రిక్స్ దేశాలవే కావడం గమనార్హం.
ఈ వ్యూహం వెనుక ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ అనిశ్చితి అని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యా విదేశీ మారక నిల్వలను ఫ్రీజ్ చేయడం అనేక దేశాలకు హెచ్చరికగా మారింది. విదేశీ కరెన్సీలలో.. ముఖ్యంగా డాలర్‌లో నిల్వలు ఉంచడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టంగా చూపించింది. అప్పటి నుంచి బంగారం వంటి భౌతిక, రాజకీయంగా తటస్థమైన ఆస్తులపై కేంద్ర బ్యాంకులు ఎక్కువగా దృష్టి పెట్టడం ప్రారంభించాయి.
ప్రస్తుతం బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వాణిజ్యంలో సుమారు 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ స్థాయిలో ఉన్న కూటమి వాణిజ్య లావాదేవీల్లో డాలర్‌ను తప్పించేందుకు స్థానిక కరెన్సీలను వినియోగించడం మొదలుపెట్టింది. భారతదేశం-రష్యా, చైనా-బ్రెజిల్ మధ్య స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం దీనికి ఉదాహరణ. ఇప్పటికే బ్రిక్స్ అంతర్గత వాణిజ్యంలో సుమారు మూడో వంతు డాలర్‌ను ఉపయోగించకుండా జరుగుతోంది.
అయితే ఇక్కడ డాలర్ పాత్ర పూర్తిగా ముగిసినట్టుకాదు. అలాగని ఇది ఒక్కసారిగా డాలర్‌ను కూల్చే విప్లవం కాదు. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బహుళ ధ్రువాల వైపు కదులుతోందనే సంకేతం. ఈ మార్పులో బంగారం మళ్లీ "అంతిమ నమ్మక ఆస్తి"గా తన స్థానం పునరుద్ధరించుకుంటోంది. క్లుప్తంగా చెప్పాలంటే బ్రిక్స్ దేశాల బంగారు వ్యూహం డాలర్ ఆధిపత్యానికి నెమ్మదిగా సవాల్ విసురుతోంది. భవిష్యత్తులో ప్రపంచ ద్రవ్య వ్యవస్థ మరింత వైవిధ్యభరితంగా మారే అవకాశాలు ఉన్నాయని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..



Click it and Unblock the Notifications