న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు శుభవార్త చెప్పింది. ఈ రంగంలో జీఎస్టీ సంబంధిత ఆందోళనలను లేకుండా చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈతో పాటు వివిధ అంశాలపై స్పందించారు.
ఆర్థిక అవతకవకలకు పాల్పడితే అధిక జరిమానా విధింపు ఉంటుందని తెలిపారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తల్ని ప్రాసిక్యూట్ చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం కాదని స్పష్టం చేశారు. ఎంఎస్‌ఎంఈల్ని బలోపేతం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎస్‌ఆర్ ఉల్లంఘనలను క్రిమినల్ నేరాల కింద పరిగణించబోమన్నారు.
ఎంఎస్‌ఎంఈలకు వెసులుబాటు కల్పించేలా ఓటీఎస్ ఉంటుందన్నారు. ఎంఎస్‌ఎంఈ రుణాలపై బ్యాంకు అధికారి ఒకే సమావేశంలో పరిష్కరిస్తారని చెప్పారు. ఎంఎస్‌ఎంఈల కోసం చెక్ బాక్స్ విధానం ఉంటుందని, బ్యాంక్ అధికారులు వేగవంత నిర్ణయాలు తీసుకునేలా చర్యలు ఉంటాయన్నారు. సాధ్యమైనంత వరకు ప్రాసిక్యూషన్ కంటే జరిమానాకే ప్రాధాన్యమిస్తామని తేల్చి చెప్పారు. కంపెనీల చట్టం కింద 14వేల ప్రాసిక్యూషన్లు ఉపసైంహరించుకున్నామన్నారు.

ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఎంఎల్ఎంఈలకు జీఎస్టీ రీఫండ్ విషయంలో టైమ్ బాండ్ ఉంటుందని తెలిపారు. అలాగే అన్ని రకాల పెండింగ్ రీఫండ్స్ కూడా 30 రోజుల్లో చెల్లిస్తామన్నారు. భవిష్యత్తులో జీఎస్టీ రీఫండ్స్ 60 రోజుల్లో పరిష్కారమవుతాయని తెలిపారు. మనీ స్టక్ అయిందని ఎంఎస్ఎంఈలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జీఎస్టీని సులభతరం చేస్తామన్నారు.
సీఎస్ఆర్ వయోలేషన్ సివిల్ మ్యాటర్ అని, సీఎస్ఆర్ ఉల్లంఘనలను క్రిమినల్ నేరాల కింద పరిగణించమని చెప్పారు. అసెసీలకు అనుగుణంగా పన్నుల విభాగం పని చేస్తుందన్నారు.
కాగా, ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అలాగే ఉంది. దాదాపు అన్ని రంగాలు ఆర్థికమాంద్యం భయంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు, శుక్రవారం ఉదయం నుంచి కూడా ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. సాయంత్రం నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వస్తున్నారని తెలియడంతో మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications