Zomato News: చరిత్ర సృష్టించిన జొమాటో.. బ్రోకరేజీల కొత్త టార్గెట్ ధర ఇదే, రూ.300 క్రాస్డ్..

Zomato Shares: దేశంలోని ఫుడ్ డెలివరీ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న కంపెనీ జొమాటో. కరోనా సమయంలో ఐపీవోగా దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ ఆ తర్వాత ఓవర్ వాల్యుయేషన్ నెపంతో భారీగా క్షీణతను చూసిన సంగతి తెలిసిందే. అయితే అత్యుత్తమ పనితీరును కనబరుస్తూ కంపెనీ కొన్ని త్రైమాసికాలుగా లాభదాయకతవైపు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నేడు ఇంట్రాడేలో స్టార్టప్ కంపెనీ జొమాటో కంపెనీ షేర్లు రికార్డు సృష్టించాయి. తొలిసారిగా నేడు కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.304.65 స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం 2.37 గంటల సమయంలో స్టాక్ ధర ఒక్కోటి రూ.299.20 వద్ద ఎన్ఎస్ఈలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.2.85 లక్షల కోట్లుగా ఉంది. దీంతో నేడు కంపెనీ షేర్లు నేడు తమ సరికొత్త 52 వారాల గరిష్ఠ ధరను చేరుకున్నాయి. ఈ క్రమంలోనే బ్రోకరేజ్ కంపెనీలు తమ బులిష్ వ్యూ గురించి వెల్లడించాయి.

Zomato stock crossed 300 mark first time Brokerages upgraded Target Prices

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోపై ప్రముఖ బ్రోకరేజ్ బెర్న్‌స్టెయిన్ అత్యుత్తమ వైఖరిని వెల్లడించింది. ఈ క్రమంలో రానున్న సమీప భవిష్యత్తులో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.335 స్థాయికి చేరుకుంటుందని టార్గెట్ ధరను ప్రకటించింది. స్విగ్గితో పోలిస్తే జోమాటోకు అధిక నగరాల్లో కవరేజ్ ఉందని బ్రోకరేజ్ పేర్కొంది. అయితే ఇదే క్రమంలో స్విగ్గీకి హైఫ్రీక్వెన్సీ యూజర్లు ఉండగా జొమాటో మాత్రం రెస్టారెంట్ గ్రాస్ ఆర్డర్ వ్యాల్యూ పరంగా స్విగ్గీ కంటే ముందు వరుసలో ఉందని బ్రోకరేజ్ వెల్లడించింది. టెక్నికల్స్ పరిశీలించినప్పుడు సైతం జొమాటో స్టాక్స్ సమీప భవిష్యత్తుతో పాటు దీర్ఘకాలంలో కూడా బులిష్ మెుమెంటం కలిగి ఉండటంతో ఇన్వెస్టర్లు ప్రస్తుతం కంపెనీ షేర్లను కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు.

వాస్తవానికి కంపెనీ పనితీరును పరిశీలిస్తే స్టాక్ మార్కెట్లో గడచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 154 శాతానికి పైగా రాబడిని అందించింది. అలాగే రెండేళ్ల కాలంలో తన ఇన్వెస్టర్లకు 353 శాతం మల్టీబ్యాగర్ రాబడులను అందించి పెద్ద సంచలనంగా మారింది. అలాగే గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లలో ఓలటాలిటీ తక్కువగా ఉండటంతో పాటు స్థిరంగా ముందుకు సాగింది. ఇదే క్రమంలో మరో బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ కంపెనీ షేర్లపై గతంలో అందించిన ఔట్ పెర్ఫామ్ రేటింగ్ కొనసాగిస్తూ టార్గెట్ ధరను రూ.370కి పెంచటం గమనార్హం. వాస్తవానికి జొమాటో వేగవంతమైన వృద్ధి స్టాక్ టార్గెట్ ధరను అప్ గ్రేడ్ చేయటానికి ప్రధాన కారణంగా బ్రోకరేజ్ వెళ్లడించింది. ఇదే క్రమంలో కంపెనీ ఇటీవలి స్విగ్గీ త్రైమాసిక ఫలితాలను జొమాటోతో కంపేర్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+