Zinka Logistics Solution IPO: దేశీయంగా స్టాక్ మార్కెల్లలోకి మిరాకిల్స్ సృష్టించే కత్తిలాంటి ఐపీవోలు ప్రతినెల కొన్ని వస్తూనే ఉన్నాయి. అయితే అలాంటి వాటిని గుర్తించి, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కలిగిన కంపెనీల ఐపీవోలపై బెట్టింగ్ వేస్తున్న తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం లాభాల ప్రయాణాన్ని నిరంతరాయంగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మరో ఐపీవో ఇన్వెస్టర్లను పెట్టుబడికి సంసిద్ధం కావాలని ఊరిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి కంపెనీ షేర్లు నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో జాబితా అయిన సంగతి తెలిసిందే. అయితే లిస్టింగ్ రోజున పెట్టుబడిదారులు మంచి లిస్టింగ్ గెయిన్స్ పొందుతారని గ్రేమార్కెట్ ప్రీమియం చూసి అందరూ భావించారు. కానీ కథ పూర్తిగా అడ్డం తిరిగింది. కంపెనీ షేర్లు కేవలం 2.89 శాతం ప్రీమియం రేటుతో మ్యూటెడ్ లిస్టింగ్ నమోదు చేయటంతో పెట్టుబడిదారులు పూర్తిగా నిరాశకు గురయ్యారు. ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు ఒక్కోటి 2.89 శాతం ప్రీమియం రేటు రూ.280.90 వద్ద ఉండగా.. బీఎస్ఈలో 2.2 శాతం ప్రీమియం ధర రూ.279.05 వద్ద జాబితా అయ్యాయి.

మెయిన్ కేటగిరీలో వచ్చిన కంపెనీ ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.1114.72 కోట్లను సమీకరించింది. ఇందులో రూ.550 కోట్లకు తాజా ఇష్యూ ఉండగా మిగిలిన మెుత్తాన్ని కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయానికి ఉంచింది. అలాగే ఉద్యోగుల కోసం రిజర్వు చేసిన షేర్లను ఒక్కోటి రూ.25 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంచింది. కంపెనీ సాధారణ పెట్టుబడిదారుల కోసం ఐపీవోను నవంబర్ 13 నుంచి 18 వరకు అందుబాటులో ఉంచింది. అలాగే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.501 కోట్లను రైస్ జేసింది. ఈ క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 54 షేర్లుగా నిర్ణయించటంతో పెట్టుబడిదారులు కనీసం రూ.14,742 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది
ఐపీవోతో వీరికే లాభం..
సంజీవ్ రంగ్రాస్ 2015లో కంపెనీలో పెట్టుబడి పెట్టారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం షేరును రూ.18.57 చొప్పున కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రీమియం ధరకు జాబితా కావటంతో 1370 శాతం లాభంగా పొందనున్నారు. అలాగే క్విక్‌రూట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ 2015లో ఒక్కో షేరుకు రూ.52.04 చొప్పున షేర్లను కొనుగోలు చేసింది. లిస్టింగ్ సమయంలో 424 శాతం కంటే ఎక్కువ లాభం పొందినట్లు తేలింది. ఇదే క్రమంలో యాక్సెల్ ఇండియా కంపెనీ షేర్లను ఒక్కో షేరుకు రూ.62.71 చొప్పున కొనుగోలు చేసింది. లిస్టింగ్‌తో 335 శాతానికి పైగా లాభాన్ని అందుకున్నారు. ఐపీవో రిటైల్ కేటగిరీలో 1.70 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల విభాగంలో 2.72 రెట్లు, 24 శాతం నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో సబ్‌స్క్రైబ్ చేయబడింది.
కంపెనీ వ్యాపారం..
ఏప్రిల్ 2015లో స్థాపించబడిన జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్ లిమిటెడ్ ట్రక్ ఆపరేటర్ల కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్, బ్లాక్‌బక్ యాప్‌ను అందిస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 963,345 ట్రక్ ఆపరేటర్లు ప్లాట్‌ఫారమ్ ద్వారా తమ వ్యాపారాన్ని నిర్వహించారు. మొత్తం భారతీయ ట్రక్ ఆపరేటర్లలో 27.52% ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్ బ్లాక్‌బక్ యాప్ అనేది ట్రక్ ఆపరేటర్లు తమ లక్ష్యాలను సమర్ధవంతంగా సాధించడంలో సహాయపడటానికి చెల్లింపులు, టెలిమాటిక్స్, సరుకు రవాణా మార్కెట్,వాహన ఫైనాన్సింగ్ సేవలను అందించే ప్లాట్‌ఫారమ్ కావటం గమనార్హం.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications