ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన జెరోధా.. ఇకపై రెండో డీమ్యాట్ ఖాతా కూడా ఓపెన్ చేసుకోవచ్చు..
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే చాలా మందికి ఒకే డీమ్యాట్ ఖాతాలోనే అన్ని షేర్లు కలిగి ఉండటం వల్ల కొంత గందరగోళంగా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఈ రోజూ ట్రేడింగ్ కోసం కొంతమంది షేర్లు కొనుగోలు చేస్తారు. అలాగే, భవిష్యత్తులోకి ఉంచుకోవాలని కొన్ని మంచి కంపెనీలను ఎక్కువకాలం హోల్డ్ చేస్తారు. ఈ రెండు వర్గాల్ని ఒకే ఖాతాలో పెట్టేసినప్పుడు, ఏది ట్రేడింగ్ కోసం? ఏది లాంగ్‌టర్మ్ కోసం అన్న దానిపై అతనికి స్పష్టత ఉండదు.
ఈ సమస్యను బాగా గుర్తించిన Zerodha ఇప్పుడు ఒక కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అదే సెకండరీ డీమ్యాట్ ఖాతా. ఈ కొత్త ఫీచర్ ద్వారా పెట్టుబడిదారులు ఇకపై రెండో ఖాతాను కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ షేర్‌లు వేరు... దీర్ఘకాలిక పెట్టుబడులు వేరు అని స్పష్టంగా చెప్పడమే దీని ఉద్దేశం.
జెరోధా యాప్‌లోనే ఉండే "కన్సోల్" ద్వారా ఈ రెండో ఖాతాను తీసుకోవచ్చు. ఒకసారి రెండో ఖాతా యాక్టివేట్ అయితే.. మీరు దీర్ఘకాలికంగా పదేళ్లు, పదిహేను ఏళ్లపాటు ఉంచుకోవాలనుకుంటున్న స్టాక్‌లను ఆ ఖాతాలో ఉంచుకోవచ్చు. అవి రోజూ ట్రేడింగ్ చేసే విభాగపు యాప్‌లో కనిపించవు. దాంతో మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఆ షేర్లు కనబడకుండా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు నిరుత్సాహపడకుండా ఇవి సైడ్‌లో ఉంటాయన్న మాట!

అదే సమయంలో మీకు ఎప్పుడైనా అమ్మాలనిపిస్తే, కన్సోల్‌లో ఒక చిన్న బటన్ క్లిక్ చేస్తే ఆ స్టాక్‌ను మీ మొదటి డీమ్యాట్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే కైట్ ద్వారా అమ్మడం సాధ్యం అవుతుంది. ఇలా చేసేటప్పుడు FIFO అనే పద్ధతి (ముందుగా కొనుకున్న షేరు ముందే అమ్మబడుతుంది) ఆటోమేటిక్‌గా ఫాలో అవుతుంది. దాంతో పన్నుల విషయంలో కూడా అర్థవంతమైన లెక్కలు పడతాయి.
ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ సెకండరీ ఖాతా నివాసిత వ్యక్తులు మాత్రమే తీసుకోవచ్చు. NRIలు, HUFలు, కార్పొరేట్ ఖాతాదారులు ఇలా ఎవరికీ ఈ ఫీచర్ అందుబాటులో లేదు. ప్రతి డీమ్యాట్ ఖాతాకు ఏడాదికి రూ. 300 + GST యాన్యూవల్ చార్జ్ ఉంటుంది. షేర్లు బదిలీ చేసే ఒక్కోసారి రూ.25 + GST చార్జ్ ఉంటుంది. ఖాతాను మూసేయాలి అనుకుంటే అది జెరోధా వద్ద ఆఫ్‌లైన్‌లోనే చేయాలి. ఆన్‌లైన్‌లో చేయడం సాధ్యం కాదు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications