Xpro India Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొందరు పెట్టుబడిదారులు మాత్రం భవిష్యత్తులో మల్టీబ్యాగర్లుగా అవతరించటానికి సిద్ధంగా ఉన్న లేదా అవకాశం ఉండే షేర్లను ఎంపిక చేసుకుని వాటిని అందరి కంటే ముందు పెట్టుబడి పెడుతున్నారు. ఈ క్రమంలో సదరు షేర్లను తక్కువ ధర వద్దే కొనుగోలు చేసేందుకు వారు ప్రయత్నిస్తుంటారు. దీనికి కావలసింది బేసిక్ టెక్నికల్స్ అర్థం చేసుకునే జ్ఞానం మాత్రమే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బిర్లా గ్రూప్ కంపెనీ అయిన ఎక్స్‌ప్రో ఇండియా షేర్ల గురించే. నేడు ఇంట్రాడేలో ఎక్స్‌ప్రో ఇండియా షేర్లు దాదాపు 10 శాతం పెరుగుదలను నమోదు చేయటంతో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ఈ పెరుగుదలతో నేడు కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.1250 స్థాయికి చేరుకుంది. అయితే కంపెనీ తన పెట్టుబడిదారులకు దీర్ఘకాలంలో అంటే 5 ఏళ్లలో మల్టీబ్యాగర్ రాబడులను తెచ్చిపెట్టింది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిపై ఏకంగా 7400 శాతం రాబడిని అందుకున్నారు.

5 ఏళ్ల కిందట కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.16 వద్ద ఉండేది. అయితే నేడు మార్కెట్ల ముగింపు సమయంలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి 6.53 శాతం లాభపడి రూ.1222.25 రేటు వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ ఇన్వెస్టర్లకు స్టాక్ మంచి రాబడిని అందించింది. రెండు రోజుల కిందట విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర ఆదాయం డిసెంబరు క్వార్టర్లో ఏడాది ప్రాతిపదికన 30 శాతానికి పైగా తగ్గుదలను నమోదు చేసింది.
ఈ క్రమంలో కంపెనీ షేర్లను ఎవరైనా ఇన్వెస్టర్ ఫిబ్రవరి 14, 2020న ఒక్కోటి రూ.16.63 రేటు వద్ద కొనుగోలు చేసి దానిని నేటి వరకు కొనసాగించి ఉంటే ఇంట్రాడేలో రూ.1249 రేటు వద్ద పరిశీలిస్తే వారి లక్ష రూపాయలు పెట్టుబడి విలువ రూ.75 లక్షల కంటే ఎక్కువ స్థాయికి చేరుకుంది. పైగా ఇందులో కంపెనీ అందించిన ఉచిత బోనస్ షేర్లను కూడా పరిగణలోకి తీసుకోలేదు. కంపెనీ జూలై 2022లో కంపెనీ 1:2 రేషియోలో అందించిన బోనస్ షేర్ల విలువను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ రాబడి మరింతగా పెరుగుతుంది.
1997లో బిర్లా గ్రూప్ కింద స్థాపించబడిన కంపెనీ పాలీమర్ ప్రాసెసింగ్ రంగంలో పనిచేస్తోంది. కంపెనీ Biax, Coex అనే రెండు డివిజన్ల కింద వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. దీనికి థర్మోసెట్ అనే మూడవ డివిజన్ కూడా ఉంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications