FIIలు భారత దిగ్గజ కంపెనీల షేర్లను ఎందుకు విక్రయిస్తున్నారు.. బ్లూచిప్ షేర్లకు ఇది ప్రమాద సంకేతమా..

Foreign Investors Exiting: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో సుదీర్ఘకాలంగా సంపద సృష్టికి చిరునామాగా నిలిచిన దిగ్గజ 'బ్లూచిప్' (Bluechip) లార్జ్-క్యాప్ కంపెనీలు ప్రస్తుతం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FIIs) తీవ్ర విక్రయాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దేశంలోని లార్జ్-క్యాప్ రంగాలు భవిష్యత్తులో నవకల్పనలు సాధించి.. తగినంత లాభాల వృద్ధిని అందించగలవా అనే అనుమానాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికం నాటికి, కనీసం రూ. 1 లక్ష కోటు అంతకంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న దాదాపు 53 ప్రముఖ భారతీయ కంపెనీలలో ఎఫ్‌ఐఐల వాటా గణనీయంగా క్షీణించింది.

విదేశీ ఇన్వెస్టర్ల నిష్క్రమణ వల్ల ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాల షేర్లలో భారీ పతనం నమోదైంది. దేశంలోనే మార్కెట్ విలువ పరంగా అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) లో ఎఫ్‌ఐఐ యాజమాన్యం 0.52 శాతం పాయింట్లు తగ్గడంతో.. ఈ ఏడాది ఆరంభం నుండి దాని షేరు ధర 24.2 శాతం పడిపోయింది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (HDFC Bank) లో విదేశీ వాటా 2.43 శాతం పాయింట్లు తగ్గగా.. దాని షేరు ఏకంగా 30 శాతం క్షీణించింది. అలాగే ఐటీసీ (ITC) లో 1.01 శాతం పాయింట్లు, మహీంద్రా & మహీంద్రా (M&M) లో 1.55 శాతం పాయింట్లు, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకి, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ వంటి బ్లూచిప్ కంపెనీల్లో కూడా విదేశీ వాటాలు తగ్గి, విపణి వాల్యుయేషన్ క్షీణించింది.

India stock market FII selling FII outflows India blue-chip stocks large-cap stocks India 1 lakh crore market cap stocks foreign institutional investors foreign portfolio investors Indian stock market news blue-chip stock outlook corporate earnings growth stock market correction large-cap valuations Reliance Industries Indian equity market FII

నగదు ప్రవాహ ఇంజన్లు మాత్రమే.. వృద్ధికి చోదక శక్తి కాదా?: ఈ విక్రయాల ధోరణి కేవలం తాత్కాలిక మూలధన సర్దుబాటు కాదని, ఇది భారతీయ లార్జ్-క్యాప్ వ్యూహాల నిర్మాణంలో ఉన్న లోతైన నిర్మాణాత్మక లోపాలను సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సామ్కో సెక్యూరిటీస్ ఫౌండర్, సీఈఓ జిమీత్ మోడీ విశ్లేషిస్తూ.. మార్కెట్లు భవిష్యత్తును ముందస్తుగా అంచనా వేసే యంత్రాలు. అవి రాబోయే 12 నుండి 36 నెలల పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రస్తుతం నిఫ్టీ 50 సూచీ యొక్క కూర్పు భవిష్యత్తుకు అనుగుణంగా లేదు. వీటికి గొప్ప వారసత్వం, గత చరిత్ర ఉందే తప్ప, రాబోయే రోజుల్లో నూతన సాంకేతికతలు, ఆవిష్కరణల ద్వారా విలువను సృష్టించే సామర్థ్యం చాలా తక్కువగా ఉంది" అని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత లార్జ్-క్యాప్ సంస్థలు కేవలం స్థిరమైన నగదు ప్రవాహాలను (Cash Flows) అందించే ఇంజన్లుగా మిగిలిపోయాయని.. కానీ వేగవంతమైన వృద్ధికి లేదా సాంకేతిక ఆవిష్కరణలకు ప్రధాన శక్తిగా మారడం లేదని మోడీ విశ్లేషించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, సౌరశక్తి వంటి వర్ధమాన రంగాలలో గ్లోబల్ స్థాయిలో పోటీపడగల కంపెనీలు భారత లార్జ్-క్యాప్ ఇండెక్స్‌లో ఇంకా విస్తృతంగా రూపుదిద్దుకోలేదని అవెండస్ వెల్త్ సంస్థ పేర్కొంది. అయితే, విదేశీ అమ్మకాలు అన్ని చోట్లా ఒకేలా ప్రభావం చూపలేదు. పేటీఎమ్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో ఎఫ్‌ఐఐ వాటా 4.57 శాతం పాయింట్లు తగ్గినప్పటికీ స్టాక్ 24 శాతం పెరగ్గా.. అదానీ పవర్, సన్ ఫార్మా, దాదాపు 700 శాతం లాభపడిన స్టెర్లైట్ టెక్నాలజీస్‌లో విదేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ (Profit Booking) జరిపారు.

చారిత్రక సగటుల కంటే దిగువకు చేరిన వాల్యుయేషన్లు: మరోవైపు విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాల వల్ల లార్జ్-క్యాప్ కంపెనీల డి-రేటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం ఇవి ఆకర్షణీయమైన 'రిస్క్-రివార్డ్' ప్రొఫైల్‌ను అందిస్తున్నాయని పలువురు ఫండ్ మేనేజర్లు వాదిస్తున్నారు. ఈక్విరస్ అసెట్ మేనేజ్‌మెంట్ నిపుణుడు అశుతోష్ తివారీ ప్రకారం, "గత రెండేళ్లుగా నిలకడైన ట్రేడింగ్ తర్వాత లార్జ్-క్యాప్ వాల్యుయేషన్లు గణనీయంగా తగ్గాయి. ఒకవేళ ఎఫ్‌ఐఐ నిధులు తిరిగి మార్కెట్లోకి వస్తే, అత్యధిక లిక్విడిటీ ఉన్న లార్జ్-క్యాప్‌లే ప్రధాన లబ్ధిదారులుగా నిలుస్తాయి."

మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం లార్జ్-క్యాప్ వాల్యుయేషన్లు వాటి చారిత్రక సగటు కంటే 18 శాతం తక్కువలో లభిస్తున్నాయి. FY26 నుండి FY28 మధ్య కాలంలో భారతీయ కార్పొరేట్ ఆదాయాలు 15 శాతం సీఏజీఆర్ (CAGR) రేటుతో వృద్ధి చెందుతాయని సంస్థ అంచనా వేస్తోంది. హెచ్‌ఎస్‌బిసి (HSBC) ఆసియా పసిఫిక్ స్ట్రాటజిస్ట్ హెరాల్డ్ వాన్ డెర్ లిండే మాట్లాడుతూ.. నిఫ్టీ 50 సూచీ ప్రస్తుతం 12 నెలల ఫార్వర్డ్ పీఈ (P/E) లో 16 రెట్ల వద్ద ట్రేడ్ అవుతోందని.. ఇది గత పదేళ్లలో అత్యల్ప స్థాయిన నమోదైన సందర్భాలలో ఒకటిగా పేర్కొన్నారు.

ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగం స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు (BFSI) ఫార్వర్డ్ ప్రైస్-టు-బుక్ వ్యాల్యూ ప్రకారం ఐదేళ్ల సగటు కంటే 30 శాతం తక్కువగా 1.7 రెట్లకే అందుబాటులో ఉన్నాయి. ఎఫ్‌ఐఐల రీ-ఎంట్రీ తక్షణమే జరగకపోయినా.. భారత బలమైన స్థూల ఆర్థిక సూచీలు (Macro Fundamentals), తగ్గిన వాల్యుయేషన్లు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు బ్లూచిప్ విభాగంలో మెరుగైన అవకాశాలను కల్పిస్తున్నాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+