స్టాక్ మార్కెట్ గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది. అందులో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలను ఆర్జించేందుకు యత్నిస్తుంటారు చాలా మంది పెట్టుబడిదారులు. స్టాక్ మార్కెట్ (లేదా ఈక్విటీ మార్కెట్, షేర్ మార్కెట్) అనేది కంపెనీ వాటా (స్టాక్/షేర్) ల కొనుగోలు, అమ్మకాలు జరిపే విక్రేతల, కొనుగోలుదారుల సముదాయంగా చెప్పవచ్చు. ఈ వాటాలు వ్యాపారంలో భాగస్వామ్యాన్ని సూచిస్తాయి. వీటిలో పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజిలో నమోదయ్యే సెక్యూరిటీలు, అలాగే ప్రైవేట్‌గా మాత్రమే ట్రేడ్ చేయబడే షేర్ల వంటివి ఉండవచ్చు.
అయితే స్టాక్ మార్కెట్లో ఎక్కువగా వినిపించే పదాలు పెన్ని స్టాక్స్, మల్టీబాగర్ పెన్నీ స్టాక్‌లు..మరి ఈ పదాలకు అర్థాలు చాల మందికి తెలియకపోవచ్చు. స్టాక్ మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ అయ్యే వారికి ఈ పదాలు కొత్తగా అనిపించవచ్చు. ఈ నేపథ్యంలోనే పెన్ని స్టాక్స్, మల్టీబాగర్ Penny stocks అంటే ఏమిటి..ఈ స్టాక్స్ లో పెట్టుబడులు పెడితే లాభమా నష్టమా అనే విషయాలను ఈ స్టోరీలో మీకు వివరంగా అందిస్తున్నాం. క్లుపంగా ఈ రెండింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి.

పెన్నీ స్టాక్స్ అంటే.. మార్కెట్‌లో చాలా తక్కువ ధరలకు ట్రేడ్ అయ్యే చిన్న కంపెనీల షేర్లుగా చెప్పవచ్చు. భారతదేశంలో సాధారణంగా ఒక షేరు ధర రూ. 100 కంటే తక్కువగా, కొన్నిసార్లు రూ. 10 లేదా రూ. 20 కంటే కూడా తక్కువగా ఉండే వాటిని పెన్నీ స్టాక్స్‌గా పిలుస్తుంటారు. ఈ కంపెనీలు చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి వాటి మార్కెట్ విలువ కూడా తక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఇది సాధారణంగా రూ.1,000 కోట్ల కంటే తక్కువగా ఉంటుంది.
ఇక పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే వాటి ధరలు ఊహించని విధంగా భారీగా పెరగవచ్చు లేదా పడిపోవచ్చు. దీర్ఘకాలంలో వీటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.ఈ నేపథ్యంలో తక్కువ ధరలో ఎక్కువ షేర్లు కొనే అవకాశం ఉండటం వల్ల, ఒక్కో షేరు ధర కొద్దిగా పెరిగినా కూడా భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.ఇక ఈ స్టాక్స్‌ను కొనేవారు, అమ్మేవారు చాలా తక్కువగా ఉంటారు. దీనివల్ల మీకు కావాల్సినప్పుడు షేర్లను సులభంగా కొనడం లేదా అమ్మడం మీకు కష్టంగా మారవచ్చు.
చాలా చిన్న కంపెనీలైనందున, వాటి ఆర్థిక స్థితి గురించి విశ్వసనీయమైన సమాచారం అంతగా అందుబాటులో ఉండదు. దీనివల్ల కంపెనీ పనితీరును అంచనా వేయడం కష్టమవుతుంది.పెన్నీ స్టాక్స్ మార్కెట్ మానిప్యులేషన్‌కు ఎక్కువగా గురవుతాయి. కొందరు వ్యక్తులు తప్పుడు వార్తలు సృష్టించి, ధరను కృత్రిమంగా పెంచి, తమ షేర్లను అధిక ధరలకు అమ్మి లాభాలు పొందుతారు. దీనివల్ల ఇతర పెట్టుబడిదారులు నష్టపోతుంటారు.
పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేవారు, తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ భరించే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందే, వాటిపై క్షుణ్ణంగా పరిశోధన చేయడం చాలా ముఖ్యం.కొత్తగా మార్కెట్‌లోకి వచ్చినవారికి ఇవి అంతగా సరిపోవు. ఆర్థికపరంగా పటిష్టంగా ఉండే కంపెనీల స్టాక్స్‌ను ఎంచుకోవడం మంచిది. మీరు కోల్పోవడానికి సిద్ధంగా ఉండే మొత్తాన్ని మాత్రమే పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది.
మల్టీబాగర్ పెన్నీ స్టాక్‌లు అనేవి తక్కువ ధరకు ట్రేడ్ అయ్యే చిన్న కంపెనీల స్టాక్‌లు. ఇవి తమ విలువను అనేక రెట్లు పెంచుకొని, పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందిస్తాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం అధిక రిస్క్‌తో కూడుకున్నది, ఎందుకంటే ఇవి చాలా అస్థిరంగా ఉంటాయి, కానీ విజయవంతమైతే, పెద్ద లాభాలు వస్తాయి. ఇవి తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న చిన్న లేదా కొత్త కంపెనీలకు చెందినవి, కాబట్టి వీటి షేర్లు తక్కువ ధరకే లభిస్తాయి. ఈ కంపెనీలు గణనీయంగా వృద్ధి చెందితే, వాటి స్టాక్ ధరలు కొన్ని రెట్లు (రెండు రెట్లు, ఐదు రెట్లు లేదా పది రెట్లు) పెరిగిపోతాయి. ఇలాంటి స్టాక్‌లను 'మల్టీబాగర్' అంటారు. ఉదాహరణకు మీరు రూ. 5కి కొన్న ఒక స్టాక్ రూ. 10కి వెళితే, అది 'రెండు-బాగర్' (100% లాభం). అలాగే రూ. 15కి వెళితే 'మూడు-బాగర్' అవుతుంది.
ఈ స్టాక్‌లలో ప్రారంభంలోనే పెట్టుబడి పెట్టిన వారు కాలక్రమేణా చాలా పెద్ద లాభాలు పొందవచ్చు. చిన్న కంపెనీలు మార్కెట్ అవకాశాలను సద్వినియోగం చేసుకుని, తమ పనితీరును మెరుగుపరుచుకుంటే, వాటి స్టాక్‌ల ధరలు విపరీతంగా పెరుగుతాయి. అయితే అధిక రిస్క్ కూడా ఉంటుంది. మల్టీబాగర్ పెన్నీ స్టాక్‌లు చాలా అస్థిరంగా (volatile) ఉంటాయి. కంపెనీ ఆర్థికంగా బలహీనంగా మారే అవకాశం ఉంది. వీటిలో పెట్టుబడి పెట్టడానికి ముందు, కంపెనీ గురించి, దాని మార్కెట్ అవకాశాల గురించి లోతుగా పరిశోధన చేయడం చాలా అవసరం. కాబట్టి మల్టీబాగర్ పెన్నీ స్టాక్‌లు అనేవి అధిక రిస్క్, అధిక రివార్డ్ ఉన్న పెట్టుబడులు. వీటిలో విజయవంతం కావడానికి సరైన పరిశోధన, వ్యూహాత్మక ప్రణాళిక, సహనం అవసరం.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications