Multibagger Stock: ఐదేళ్లలో రూ.లక్ష పెట్టుబడిని రూ.18 లక్షలు చేసిన స్టాక్ ఇదే..!
పైపుల తయారీ కంపెనీ వెల్స్‌పన్ కార్ప్ లిమిటెడ్ మల్టీబ్యార్ రిటర్న్స్ అందిస్తోంది. ఈ కంపెనీ వెల్డెడ్ లైన్ పైపులు, డక్టైల్ ఐరన్ (DI) పైపులు, TMT రీబార్స్, స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యూబ్‌లు తయారు చేస్తోంది. ఈ స్టాక్ కేవలం 5 సంవత్సరాలలోనే వాటాదారులకు 1,725.87 శాతం మల్టీబ్యాగర్ రాబడిని అందించడం ద్వారా భారీ సంపదను సృష్టించింది. ఈ కంపెనీ రూ.68,767.58 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో కొనసాగుతుంది. 2021 అక్టోబర్ 1న రూ. 143గా ఉన్న ధర స్టాక్ ప్రైస్ 2026 అక్టోబర్ 1 నాటికి రూ. 2,611 పెరిగింది. అంటే దాదాపు 1,725.87 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఉదాహరణకు ఎవరైనా 5 సంవత్సరాల క్రితం ఈ కంపెనీ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. అది దాదాపు రూ. 18.26 లక్షలుగా మారి ఉండేది.
వెల్స్‌పన్ కార్ప్ లిమిటెడ్ 'వెల్స్‌పన్ వరల్డ్'లో ఒక భాగంగా ఉంది. లైన్ పైపుల తయారీలో ప్రపంచ స్థాయి సంస్థ. ఇది ఇంధన, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం LSAW, HSAW, HFW, HFIW పైపుల వంటి ఉత్పత్తులను అందిస్తుంది. ఈ కంపెనీ భారతదేశం, అమెరికా (USA), సౌదీ అరేబియా (KSA)లలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. పెద్ద వ్యాసం కలిగిన లైన్ పైపుల రంగంలో ఇది ప్రపంచ స్థాయి సంస్థగా కొనసాగుతోంది. దీని ఉత్పత్తుల శ్రేణిలో LSAW, స్పైరల్, ERW పైపులు ఉన్నాయి. ఇవి ప్రధానంగా చమురు & గ్యాస్, నీటి సరఫరా ప్రాజెక్టుల అవసరాలను తీరుస్తాయి. ఈ కంపెనీ భారతదేశంలో డక్టైల్ ఐరన్ పైపుల రంగంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ కంపెనీ DN 2600 మి.మీ వరకు పరిమాణం కలిగిన పైపులను తయారు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో ఉన్న ప్లాంట్లు మాత్రమే ఇంతటి పరిమాణంలో పైపులను ఉత్పత్తి చేయగలవు. సింటెక్స్ ద్వారా, వెల్స్‌పన్ భారతదేశవ్యాప్తంగా నీటి నిల్వ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపుల రంగంలో బలమైన ఉనికిని కలిగి ఉంది. ఇది నీటి పంపిణీ, నిల్వ, తుది వినియోగ అవసరాలకు సేవలు అందిస్తోంది. వెల్స్‌పన్ స్పెషాలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ (WSSL) ఒక సమీకృత స్టెయిన్‌లెస్-స్టీల్ ఉత్పత్తిదారు. ఇది స్టెయిన్‌లెస్-స్టీల్ తయారీ నుంచి తుది ఉత్పత్తుల వరకు కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని ఉత్పత్తులు విద్యుత్, అణు, ఏరోస్పేస్ వంటి రంగాలకు సేవలు అందిస్తాయి.
ఇటీవల ఈ కంపెనీకి సౌదీ అరామ్కో నుంచి కూడా ఒక ఆర్డర్ లభించింది. వెల్స్‌పన్ కార్ప్ తన అమెరికాలోని తయారీ కేంద్రం నుంచి పైపుల సరఫరా కోసం $1.8 బిలియన్లు, లేదా దాదాపు రూ. 17,200 కోట్ల విలువైన, తన చరిత్రలోనే అతిపెద్ద ఆర్డర్‌ను పొందిన కేవలం ఒక నెల తర్వాత ఈ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్‌తో కంపెనీ ఆర్డర్ బుక్ రికార్డు స్థాయిలో రూ. 42,100 కోట్లకు ($4.4 బిలియన్లు) చేరుకుంది. ఈ కంపెనీ FY27కి రూ. 20,000 కోట్ల ఆదాయాన్ని, రూ. 2,850 కోట్ల EBITDAను అంచనా వేసింది. ఈ భారీ ఆర్డర్ అనంతరం, తమ కంపెనీ కేవలం స్థిర-ధర ఒప్పందాలపైనే పనిచేస్తుందని, ఈ ఏడాది ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి బలమైన ఆర్డర్ల వస్తాయని ఆశిస్తున్నట్లు ఎండీ & సీఈఓ విపుల్ మాథుర్ తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
