Kent RO IPO: భారతీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలకు భారీగా ప్రజల నుంచి ఆమోదం లభిస్తోంది. ప్రధానంగా కరోనా తర్వాత రిటైల్ పెట్టుబడిదారుల పార్టిసిపేషన్ పెరగటంతో ఈక్విటీలతో పాటు ఐపీవోలపై బెట్టింగ్ వేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో చాలా కంపెనీలు తమ ఐపీవోలను ఫ్లోట్ చేయటానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కెంట్ ఆర్ఓ సిస్టమ్స్ కంపెనీ ఐపీవో గురించే. తాజాగా కంపెనీ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ వద్ద ఐపీవో కోసం ముసాయిదా పత్రాలను సమర్పించింది. అయితే ఇందులో ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించేందుకు దాదాపు కోటి షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద అమ్మకానికి పెడుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ వ్యవస్థాపకులు మహేశ్ గుప్తా 5,635,088 ఈక్విటీ షేర్లు, సునీతా గుప్తా 3,360,910 పేర్లు, వరుణ్ గుప్తా 1,098,570 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.

ప్రమోటర్లుగా ఉన్న సునీతా గుప్తా, మహేష్ గుప్తా, వరుణ్ గుప్తాలకు ప్రస్తుతం కంపెనీలో 99.77 శాతం వాటాలు ఉన్నాయి. అయితే ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వారు హోల్డ్ చేస్తున్న వాటాలో 10 శాతాన్ని విక్రయించేందుకు కోటికి పైగా షేర్లను అమ్మకానికి ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లు మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్, JM ఫైనాన్షియల్ లిమిటెడ్ వ్యవహరిస్తున్నాయి. అంటే తాజా ఐపీవో నుంచి సేకరించే మెుత్తం డబ్బు పూర్తిగా ప్రమోటర్లకు వెళుతుందని, కంపెనీ ఏమీ లభించబోదని తెలుస్తోంది.
కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,178 కోట్ల ఆదాయాన్ని చూసింది. అయితే ఇది ప్రత్యర్థి సంస్థ యురేకా ఆదాయం రూ.2,189 కోట్ల కంటే వెనుకబడింది. 1999లో స్థాపించబడిన కంపెనీ వాటర్ ప్యూరిఫయర్లతో పాటు వ్యాక్యూమ్ క్లీనర్లు, ప్యాన్ల వ్యాపారంలో కూడా కొనసాగుతోంది. అయితే కంపెనీ ఆదాయంలో 85 శాతం ప్యూరిఫయర్ల అమ్మకం నుంచే రావటం గమనార్హం. సెబీ ఐపీవోల విషయంలో కొత్త ప్రయోగాలు చేయాలని చూస్తున్న వేళ కెంట్ ఐపీవో రావటం గమనార్హం.
2025లో కూడా ఐపీవోల జాతర భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద చప్పుడు చేస్తోంది. 2024లో భారతీయ సంస్థలు రికార్డు స్థాయిలో18.5 బిలియన్ డాలర్లను ఐపీవోలను ఫ్లోట్ చేయటం ద్వారా సమీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2025లో ఇప్పటివరకు దాదాపు 14 కంపెనీలు ఐపీవోలో వాటాల విక్రయించటం ప్రారంభించాయని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్ బీఎస్ఈ అందించిన డేటా వెల్లడించింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications