FIIల పెట్టుబడుల దెబ్బ..ఈ 3 కంపెనీల స్టాక్స్‌లో లాభాలే లాభాలు..మీ వాచ్ లిస్టులో చేర్చుకోండి వెంటనే..

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) కీలక పాత్ర వహిస్తుంటారు. విదేశాల్లో ఉంటున్న వారు లేక సంస్థలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలను ఆర్జిస్తుంటారు. foreign institutional investors గ్లోబల్ మార్కెట్లో పెట్టుబడులు పెంచడమే కాకుండా.. కంపెనీల భవిష్యత్ ను నిర్థారించే ప్రధాన అంశంగా కూడా మారుతుంటారు. ఎఫ్ఐఐ పెట్టుబడుల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. మన దేశంలో 2025 మే, జూన్ నెలల్లో మూడు స్టాక్‌లలో FIIs పెట్టుబడులు పెట్టి తమ వాటాలను గణనీయంగా పెంచుకున్నారు.

FII అంటే ఏమిటీ ? ఎఫ్ఐఐ అనేది రిజిస్టర్ చేయబడిన లేదా ఒక దేశంలో ప్రధాన కార్యాలయం ఉండి మరో దేశంలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారు లేదా పెట్టుబడి నిధి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారు అనే పదం బహుశా మన దేశంలో ఎక్కువగానే ఉపయోగిస్తుంటారు. దేశ ఆర్థిక మార్కెట్లలో పెట్టుబడి పెట్టే బయటి సంస్థలను ఇది సూచిస్తుంది. FIIలు ఒక దేశం యొక్క ఆర్థిక మార్కెట్లలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.

FII stock picks foreign institutional investors FII stake increase top FII stocks stocks with rising FII holding Indian stock market news FII investment India 3 stocks FIIs buying best stocks to watch watchlist stocks FII bullish stocks stock market trends stock picks June 2025 FII portfolio updates FII buying activity FII FII FII FII 2025 FIIs FII

వారు స్టాక్ మార్కెట్లలో లిక్విడిటీని పెంచుతారు, ఆర్థిక వృద్ధికి మద్దతు ఇస్తూ విదేశీ మూలధనాన్ని ఆకర్షిస్తారు. FIIలలో పెన్షన్ ఫండ్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, హెడ్జ్ ఫండ్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు వంటివి ఉంటాయి. ఇంకో కీలక విషయం ఏంటంటే.. వీరు పెట్టుబడుల ఉపసంహరించుకున్న సమయంలో స్టాక్ మార్కెట్లు అనేక ఒడిదుడుకులకు దారి తీయవచ్చు. మన దేశంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఈ FIIల పెట్టుబడులను నియంత్రిస్తుంది. వీటి పెట్టుబడులపై పరిమితి వ్యవహారాన్ని భారత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిశీలిస్తుంది.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) మే, జూన్ నెలల్లో ఈ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు.

RACL గియర్‌టెక్ లిమిటెడ్ : ఈ కంపెనీ ఆటోమొబైల్ రంగానికి సంబంధించింది. వాహనాల కోసం ఆటోమోటివ్ భాగాలను తయారుచేస్తుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,040 కోట్లు కాగా, షేరు ధర రూ.964 వద్ద ముగిసింది. FIIలు తమ వాటాను Q4FY25లో 0.03% నుండి మే 2025లో 8.84%కి పెంచారు. ఇది 8.81% పెరుగుదలగా నమోదైంది.

శాలిభద్ర ఫైనాన్స్ లిమిటెడ్ : ఇది ఒక NBFC సంస్థ. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆస్తి ఆధారిత రుణాలు ఇస్తుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.398 కోట్లు. దీని షేరు ధర రూ.129 వద్ద ముగిసింది. FII వాటా 0.82% నుండి 2.63%కి పెరిగింది. అంటే 1.81% వృద్ధిగా నమోదైంది.

విషాల్ ఫ్యాబ్రిక్స్ : ఈ టెక్స్టైల్ కంపెనీ డెనిమ్, డైడ్ యార్న్ వంటి ఉత్పత్తుల తయారీ, అమ్మకాలను చేస్తుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.695 కోట్లు. షేరు ధర రూ.35.2. ఇక్కడ FIIలు తమ వాటాను 3.21% నుండి 8.72%కి పెంచారు. అంటే 5.51% పెరిగింది.

ఈ స్టాక్స్‌పై FIIలు చూపిన ఆసక్తి.. వాటి భవిష్యత్ పెరుగుదలకు సంకేతంగా పరిగణించవచ్చు. మీరు మీ వాచ్‌లిస్ట్‌లో వీటిని తప్పకుండా చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

ఇండియాలో పెట్టుబడులు పెట్టే FIIలలో ఫారిన్ మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్, ట్రస్ట్ లు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు, బీమా కంపెనీలు వంటివి ఉన్నాయి. ఈక్విటీలు ఇతరత్రా వాటిల్లో foreign institutional investors పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. సెబీ వద్ద ప్రస్తుతం 1,450 కు పైగా ఎఫ్ఐఐలు రిజిస్టర్ అయి ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా సంక్షోభ సమయంలో పెట్టబడులను ఉపసంహరించుకుంటే స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. దీంతో ఆ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+