PhonePe IPO: గడచిన కొన్ని రోజులుగా దేశీయంగా స్టాక్ మార్కెట్లలోకి వస్తున్న క్రేజీ ఐపీవోల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంలో మార్కెట్లు ఒడిదొడుకుల్లో ఉండటం కూడా రిటైల్ పెట్టుబడిదారులను మార్కెట్లకు కొంత దూరంగా ఉండేలా చేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త కంపెనీలు తమ ఐపీవో ఫ్లోటింగ్ ప్లాన్స్ రివీల్ చేస్తున్నాయి.
అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ యాజమాన్యంలో పనిచేస్తున్న PhonePe సంస్థ చాలా కాలంగా తన ఐపీవోను తీసుకురావటం కోసం అవసరమైన సన్నాహాలను చేస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా 2023లో ఇన్వెస్టర్ల నుంచి ఫండింగ్ అందుకున్న కంపెనీ విలువ అప్పట్లో 10 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. అయితే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు విస్తరించటంతో ఈ విలువ మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్లో పేటీఎం, నావీ, గూగుల్ పే వంటి ఇతర పోటీదారులను కలిగి ఉంది.

వాస్తవానికి సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ 2022 డిసెంబరులో తన బిజినెస్ ఆపరేషన్స్ ఇండియాకు మార్చేసింది. దీని కారణంగా కంపెనీ దాదాపు 8000 కోట్ల మేర భారీ పన్ను చెల్లింపులను చేపట్టాల్సి వచ్చింది. దీని కారణంగా నాన్ పేమెంట్ సేవలను కంపెనీ పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీవో ఫ్లోట్ చేయటానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో కంపెనీ తన ప్లాన్ ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది.
కంపెనీ తన IPOకి సంబంధించి సన్నాహక చర్యలను ప్రారంభించినట్లు ఫోన్‌పే ఒక ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా కంపెనీ తన వ్యాపారాన్ని భారతీయ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయాలని యోచిస్తోంది. ఈ ఏడాది కంపెనీ తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించి 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఐపీవో ప్లాన్ మంచి మైలురాయిగా నిలుస్తుందని తెలుస్తోంది. కంపెనీ తన డిజిటల్ సేవల ద్వారా ప్రస్తుతం దేశంలో కోట్ల మంది ప్రజలకు సేవలను అందిస్తూ దగ్గరైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆర్థిక ఫలితాలు ప్రస్తుతం కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించటానికి అనుకూలంగా ఉన్నట్లు యాజమాన్యం భావిస్తోంది.
2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 73 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో కంపెనీ మెుత్తం ఆదాయం రూ.5064 కోట్లుగా నమోదైందని బెంగళూరు టెక్ కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో కంపెనీ తన నికర ఆదాయం రూ.197 కోట్లుగా నమోదు చేసి నష్టాల నుంచి బయటకు వచ్చింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications