అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాకు ఆర్థిక సంక్షోభాన్ని మిగిల్చే దిశగా కనిపిస్తున్నాయి. ట్రంప్ తాజాగా తీసుకున్న సుంకాలతో పాటుగా కార్మిక మార్కెట్ డేటాతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. 2025 ఆగస్టు 1న అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. దీని ప్రధాన కారణాలను చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రకటించిన తాజా సుంకాల దాడి.. అమెరికా కార్మిక రంగంలో బలహీన సంకేతాలను చూపింది.ఈ ఆర్థిక డేటా స్టాక్ మార్కెట్ పతనానికి కారణమైంది. ఈ రెండు అంశాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులో ఆందోళకర పరిస్థితులకు లోనయ్యారు. దీంతో పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకున్నారు.
నెలల తరబడి న్యూయార్క్ మార్కెట్లు స్థిరంగా ఉన్న సమయంలో..డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన తాజా నిర్ణయాలు గ్లోబల్ వాణిజ్యంపై మరోసారి గందరగోళ పరిస్థితులను సృష్టించాయి. ముఖ్యంగా, చైనా, మెక్సికో, ఇండియా వంటి కీలక వాణిజ్య భాగస్వాము దేశాలపై అమెరికా భారీగా సుంకాలను విధించింది. ఈ దేశాలపై కొత్త సుంకాలను విధించనుందని ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. ఈ వార్త మార్కెట్‌లో వెంటనే ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

అదే సమయంలో కార్మిక శాఖ విడుదల చేసిన ఉద్యోగాల డేటా అనూహ్యంగా పెట్టుబడిదారులను నిరాశపరిచింది. జూన్, జూలై నెలల్లో ఉద్యోగాల సృష్టిలో స్పష్టమైన మందగమనాన్ని ఈ నివేదిక బయలకు తీసుకువచ్చింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ రంగంలో డిమాండ్ తక్కువవుతుందోన్న సంకేతాలను ఇస్తోంది. నిరుద్యోగిత రేటు స్వల్పంగా పెరగడం కూడా పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది.
శుక్రవారం నాడు, S&P 500 ఇండెక్స్ 1.6 శాతం పడిపోయింది. ఇది ఏప్రిల్ తర్వాత పెద్ద నష్టంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. మొత్తం వారాంతంలో ఈ సూచీ 2.4 శాతం తగ్గింది. Dow Jones Industrial Average, Nasdaq Composite కూడా గణనీయమైన నష్టాలను చవిచూశాయి.ఇక ఇతర ఆస్తుల విషయానికి వస్తే.. డాలర్ విలువ కూడా భారీ నష్టాలతో కొనసాగుతోంది. ఎందుకంటే పెట్టుబడిదారులు అమెరికా ఆర్థిక భవిష్యత్తుపై సందేహంతో ఉన్నారు. దీంతో డాలర్ విలువ తగ్గింది. బాండ్లు కొంత స్థిరతను చూపించాయి కానీ బంగారం వంటి సురక్షిత ఆస్థులవైపు డిమాండ్ పెరిగింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య సంఘర్షణలు తిరిగి తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వృద్ధిలో మందగమనం సంకేతాలు కలిసి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. పెట్టుబడిదారులు తదుపరి ఫెడరల్ రిజర్వ్ సమావేశాన్ని.. ట్రంప్ పరిపాలన నుండి మరిన్ని తక్షణ చర్యలను గమనిస్తున్నారన్నది తాజా పరిస్తితులు తెలియజేస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications