Waaree Energies Stock: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల జోరు తర్వాత నేడు బేజారటం అనేక కంపెనీల షేర్లను నష్టాల్లోకి నెడుతోంది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో సంచనం సృష్టించిన సోలార్ కంపెనీ షేర్లు నేడు భారీ క్షీణతను చూస్తున్నాయి. అయితే నిపుణులు మాత్రం దీనిపై తమ ఆసక్తిని కొనసాగిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వారీ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. గత నెలలో మార్కెట్లో జాబితా అయిన కంపెనీ షేర్లు ఊహించని రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్లో అడుగుపెట్టిన తర్వాతి నుంచి నిన్నటి వరకు స్టాక్ నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే నేడు మాత్రం తొలిసారిగా కంపెనీ షేర్లలో క్షీణత నమోదైంది. గత 8 ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ తన ఇన్వెస్టర్లకు ఏకంగా 150 శాతం అద్భుత రాబడిని అందించి సోలార్ స్టాక్ తన స్టామినాను నిరూపించుకుంది.

నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్ ధర 8 శాతం క్షీణించిన రూ.290 మేర తగ్గింది. దీంతో స్టాక్ చివరికి ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.3346 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో ఉదయం కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.3574 వద్ద తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. ఇంట్రాడేలో ఒక స్థాయిలో స్టాక్ ధర ఏకంగా రూ.3300కి పడిపోయింది. అయితే తర్వాత తిరిగి స్వల్పంగా లాభపడ్డాయి. సోలార్ మాడ్యూల్ ఎగుమతుల్లో కంపెనీ అత్యధికంగా 44 శాతం మార్కెట్ వాటాలను కలిగి ఉంది. నిన్న స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారం ప్రకారం లిస్టింగ్ తర్వాత తొలి ఆర్డర్ అందుకున్నట్లు తెలిపింది. కంపెనీ ప్రస్తుతం సూరత్, టంబ్, నందిగ్రామ్, చిఖాలీలలో 5 తయారీ కేంద్రాలను కలిగి ఉంది. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ మార్కెట్ క్యాప్ మార్కెట్ల ముగింపు సమయంలో రూ.96,380 కోట్ల వద్ద స్థిరపడింది.
వారీ ఎనర్జీస్ తన ప్రైస్ బ్యాండ్ ధరను రూ.1427 నుంచి రూ.1503గా నిర్ణయించింది. ఇదే క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 9 షేర్లుగా నిర్ణయించటంతో కనీసం ఒక లాట్ కొనుగోలు చేయటానికి ఇన్వెస్టర్లు రూ.13,527 వెచ్చించారు. కంపెనీ ఐపీవో ఇష్యూలో షేర్ల కోసం 97.34 లక్షల దరఖాస్తులను అందుకుని సరికొత్త రికార్డులను లిఖించింది. మెయిన్ కేటగిరీలో లిస్టింగ్ కోసం వస్తున్న ఐపీవో రూ.3,600 కోట్ల ఫ్రెష్ ఇష్యూ కోసం 2.4 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తుండగా.. మిగిలిన రూ.721.44 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ కోసం ఉంచింది. కంపెనీ బలమైన లిస్టింగ్ తో గత ఐపీవోల రికార్డులను తిరగరాసింది. వాస్తవానికి ఐపీవో ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం సోమవారం తెరవబడింది. నిన్నటితో ఆఫర్ క్లోజ్ అయిన మెయిన్ బోర్డ్ ఐపీవో రూ.4,321.44 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో వచ్చింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications