IPO News: తొలిరోజు దుమ్మురేపిన ఐపీవో.. నిమిషాల్లో ఒక్కో షేరుకు రూ.1,000 లిస్టింగ్ లాభం, పార్టీ..
Waaree Energies IPO: నెల చివరికి వచ్చిన సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొద్దిగా తగ్గింది. అయితే ఈవారం లిస్టింగులు వరుసగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవో లాభాల బీభత్సం సృష్టించింది. దీంతో ఐపీవోలపై బెట్టింగ్ వేస్తున్న ఇన్వెస్టర్ల తొలిరోజే భారీ లాభాల కోసం కొన్నిసార్లు ప్రాఫిట్ బుకింగ్ కూడా చేస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు మార్కెట్లో జాబితా అయిన వారీ ఎనర్జీస్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర కంటే 66.33 శాతం అధికంగా రూ.2500 రేటు వద్ద జాబితా అయ్యాయి. ఇదే క్రమంలో వారీ స్టాక్ బీఎస్ఈలో ఒక్కోటి ఇష్యూ రేటు కంటే 69.66 శాతం ప్రీమియం రేటు రూ.2550కి అడుగుపెట్టాయి. దీంతో షేర్లు అలాట్ అయిన ఇన్వెస్టర్లు ఒక్కో షేరుపై రూ.1000 కంటే ఎక్కువ రాబడిని అందుకున్నారు.

ఐపీవో ప్రారంభమైన నాటి నుంచి కంపెనీపై ఇన్వెస్టర్లు భారీగా సానుకూల స్పందనను కనబరిచిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో గ్రేమార్కెట్లో కంపెనీ ఐపీవో 100 శాతం ప్రీమియం ధర కూడా పలికిన సంగతి తెలిసిందే. బిడ్డింగ్ ముగిసిన సమయంలో కూడా 90 శాతం ప్రీమియం రేటు పలికినప్పటికీ చివరికి 70 శాతం రేటుకు దగ్గరలో ఐపీవో జాబితా కావటంతో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మంచి లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో స్టాక్ ధర 9 శాతం మేర క్షీణతను చూసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వారీ ఎనర్జీస్ కంపెనీ ఐపీవో గురించే. ఐపీవో చివరి రోజున 76 కంటే ఎక్కువ సార్లు సభ్యత్వాన్ని పొందింది. తాజాగా పెట్టుబడిదారుల నుంచి షేర్ల కోసం అత్యధిక దరఖాస్తులు అందుకుని గత ఐపీవోల రికార్డులను తిరగరాసింది. వాస్తవానికి ఐపీవో ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం సోమవారం తెరవబడింది. నిన్నటితో ఆఫర్ క్లోజ్ అయిన మెయిన్ బోర్డ్ ఐపీవో రూ.4,321.44 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో వచ్చింది. ఈ క్రమంలో కంపెనీ క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ కోసం 50 శాతం, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం షేర్లను కేటాయించింది. ఇదే క్రమంలో కంపెనీ ఉద్యోగులకు 650 మిలియన్ షేర్లను రిజర్వు చేసింది.
ఐపీవో కోసం వారీ ఎనర్జీస్ తన ప్రైస్ బ్యాండ్ ధరను రూ.1427 నుంచి రూ.1503గా నిర్ణయించింది. ఇదే క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 9 షేర్లుగా నిర్ణయించటంతో కనీసం ఒక లాట్ కొనుగోలు చేయటానికి ఇన్వెస్టర్లు రూ.13,527 వెచ్చించారు. కంపెనీ ఐపీవో ఇష్యూలో షేర్ల కోసం 97.34 లక్షల దరఖాస్తులను అందుకుని సరికొత్త రికార్డులను లిఖించింది. మెయిన్ కేటగిరీలో లిస్టింగ్ కోసం వస్తున్న ఐపీవో రూ.3,600 కోట్ల ఫ్రెష్ ఇష్యూ కోసం 2.4 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తుండగా.. మిగిలిన రూ.721.44 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ కోసం ఉంచింది. దీంతో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో లిస్టింగ్ కోసం రాబోతున్నాయి. అలాగే కంపెనీ షేర్లు అక్టోబర్ 28న మార్కెట్లో జాబితా కోసం వస్తున్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications