IPO News: త్వరలో ఓపెన్ అవుతున్న ఐపీవో.. గ్రేమార్కెట్లో రికార్డుల మోత, డోన్ట్ మిస్ ట్రేడర్స్..
Waaree Energies IPO: చాలా కాలం కొనసాగిన ఎస్ఎమ్ఈ ఐపీవోల కోలాహలం తర్వాత ప్రస్తుతం మెయిన్ కేటగిరీలో అనేక ఐపీవోలు మార్కెట్లోకి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులు చురుకుగా వీటిలో షేర్లను పొందేందుకు ఐపీవో దరఖాస్తులు వేస్తున్నారు. ఈ ఐపీవోలు స్టార్ట్ కాకమునుపే గ్రేమార్కెట్లో భారీ ప్రీమియం పలుకుతున్నాయి. దీంతో బెట్టింగ్ వేసే ఇన్వెస్టర్ల నుంచి జోష్ కొనసాగుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వారీ ఎనర్జీస్ లిమిటెడ్ ఐపీవో గురించే. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.4,321.44 కోట్లను సమీకరించాలని చూస్తోంది. మెయిన్ కేటగిరీలో లిస్టింగ్ కోసం వస్తున్న ఐపీవో రూ.3,600 కోట్ల ఫ్రెష్ ఇష్యూ కోసం 2.4 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తుండగా.. మిగిలిన రూ.721.44 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ కోసం ఉంచింది. దీంతో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో లిస్టింగ్ కోసం రాబోతున్నాయి. దేశంలోని రిటైల్ పెట్టుబడిదారుల కోసం ఈ ఐపీవో అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 23 వరకు బెట్టింగ్ వేసేందుకు తెరచి ఉంచబడుతుంది. కంపెనీ షేర్లు అక్టోబర్ 28న మార్కెట్లో జాబితా కోసం వస్తున్నాయని తెలుస్తోంది.

ఐపీవో కోసం వారీ ఎనర్జీస్ తన ప్రైస్ బ్యాండ్ ధరను రూ.1427 నుంచి రూ.1503గా నిర్ణయించింది. ఇదే క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 9 షేర్లుగా నిర్ణయించటంతో కనీసం ఒక లాట్ కొనుగోలు చేయటానికి ఇన్వెస్టర్లు రూ.13,527 వెచ్చించాల్సి ఉంటుందని వెల్లడైంది. అయితే ఇంకా ఐపీవో ప్రారంభం కాకమునుపే గ్రేమార్కెట్లో వారీ ఎనర్జీస్ ఐపీవోకు బలమైన ఆధరణ ఇన్వెస్టర్ల నుంచి లభిస్తోంది. దీంతో ఒక్కో షేరుపై రూ.1280 ప్రీమియం పలకటం సమచలనంగా మారింది. దీంతో అనేక మంది ఇన్వెస్టర్లు కంపెనీ ఐపీవోకు దరఖాస్తు చేసి ఈ లాభాలను అందుకోవాలని చూస్తున్నారు. లిస్టింగ్ రోజు వరకూ ఇదే ప్రీమియం కొనసాగితే స్టాక్ రూ.2783 వద్ద జాబితా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇన్వెస్టర్లు భారీ లాభాలను తొలిరోజే అందుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గ్రేమార్కెట్లో ప్రీమియం 85 శాతాన్ని తాకటంతో మార్కెట్లో ఈ కంపెనీ ఐపీవోపై పెద్ద చర్చ కొనసాగుతోంది. కంపెనీ 1990లో స్థాపించబడింది. దేశీయ సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ కంపెనీగా ఉన్న వారీ ఎనర్జీస్ లిమిటెడ్ 12 GW స్థాపిత సామర్థ్యంతో సోలార్ వ్యాపారంలో పెద్ద ఆటగాడిగా కొనసాగుతోంది. కంపెనీ మల్టీక్రిస్టలైన్ మాడ్యూల్స్, మోనోక్రిస్టలైన్ మాడ్యూల్స్ తయారీలో కంపెనీ ఉంది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 4 తయారీ యూనిట్లు ఉన్నాయని తెలుస్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్ సౌకర్యాలు దేశంలోని సూరత్, టంబ్, నందిగ్రామ్, చిఖ్లీలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications