Vodafone Idea Share: జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న వోడాఫోన్ ఐడియా షేర్.. ఇన్వెస్టర్లకు పండగే!
టెలికాం రంగంలో అంచనాలను తలకిందులు చేస్తూ వోడాఫోన్ ఐడియా షేర్ (Vodafone Idea share) అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. 2026 సంవత్సరంలోనే అత్యధిక ధర వద్ద ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గతేడాది డిసెంబర్ 30 తర్వాత, మళ్లీ ఇప్పుడే ఈ షేర్ రూ. 12 మార్కును దాటి క్లోజ్ అవ్వడం విశేషం. కేవలం ఒకే రోజులో ఈ స్టాక్ 8 శాతం మేర లాభపడి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ , కంపెనీ క్లారిటీ
ఇటీవల బ్లూమ్‌బెర్గ్ సంస్థ ప్రచురించిన ఒక కథనం మార్కెట్లో హాట్ టాపిక్ అయ్యింది. వోడాఫోన్ గ్రూప్ తన వద్ద ఉన్న వాటాలో కొంత భాగాన్ని ఇండియన్ యూనిట్‌కు 'ట్రెజరీ స్టాక్' రూపంలో బదిలీ చేయనుందని, దీని ద్వారా కంపెనీకి ఆర్థిక బలం చేకూరుతుందని ఆ కథనం పేర్కొంది. అయితే, దీనిపై వోడాఫోన్ ఐడియా స్పందిస్తూ.. తమకు వోడాఫోన్ గ్రూప్ నుండి ఇప్పటివరకు అలాంటి అధికారిక సమాచారం అందలేదని క్లారిటీ ఇచ్చింది.
CLAM ఒప్పందం ఏంటి?
కంపెనీ ఇచ్చిన వివరణ ప్రకారం.. ఇది గతంలో చేసుకున్న 'కాంటింజెంట్ లయబిలిటీ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం' (CLAM) ఒప్పందానికి సంబంధించిన విషయం కావచ్చు. ఈ ఒప్పందం కింద వోడాఫోన్ గ్రూప్ నుంచి సుమారు రూ. 6,394 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటికే కొంత నగదు అందింది. మిగిలిన మొత్తాన్ని సెటిల్ చేయడానికి వోడాఫోన్ ఐడియాకు చెందిన 328 కోట్ల షేర్లను ఐదేళ్ల కాలానికి కేటాయించారు. ఈ షేర్లను అమ్మగా వచ్చే సొమ్ము మొత్తం వోడాఫోన్ ఐడియాకే దక్కుతుంది. ఈ షేర్ల విలువ ఇప్పుడు రూ. 4,000 కోట్లు దాటడం కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్.
కుమార్ మంగళం బిర్లా రీ-ఎంట్రీ
కంపెనీలో మళ్ళీ మునుపటి వైభవం వస్తుందనే నమ్మకానికి ప్రధాన కారణం కుమార్ మంగళం బిర్లా. ఆయన మళ్లీ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం ఇన్వెస్టర్లలో భారీ నమ్మకాన్ని నింపింది. దీనికి తోడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుండి దాదాపు రూ. 35,000 కోట్ల భారీ రుణం కోసం కంపెనీ చర్చలు జరుపుతోంది. ఈ నిధులు అందితే నెట్‌వర్క్ విస్తరణ , 5G సేవలపై కంపెనీ మరింత వేగంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.
పెరిగిన సబ్‌స్క్రైబర్లు
వోడాఫోన్ ఐడియాకు మరో శుభవార్త ఏమిటంటే.. గత రెండు నెలలుగా కొత్త కస్టమర్లు భారీగా చేరుతున్నారు. చాలా కాలం పాటు సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన తర్వాత, మళ్లీ నెట్ బేసిస్ మీద యూజర్లు పెరగడం టెలికాం రంగంలో ఈ కంపెనీ పుంజుకుంటోందని చెప్పడానికి నిదర్శనం. సోమవారం ఒక్కరోజే దాదాపు 180 కోట్ల షేర్లు ట్రేడ్ అయ్యాయంటే ఈ స్టాక్ మీద ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మొత్తానికి, బిర్లా రాక, బ్యాంకుల రుణాలు, , వోడాఫోన్ గ్రూప్ నుండి అందబోయే నిధులు అన్నీ కలిసి వోడాఫోన్ షేర్ (Vodafone Idea share) కు రెక్కలు తొడుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ స్టాక్ మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications