రెండున్నర సంవత్సరాల క్రితం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేసినట్టే.. ఇప్పుడు మరో అమెరికన్ షార్ట్ సెల్లర్ వైస్రాయ్ రీసెర్చ్ భారతీయ దిగ్గజ కంపెనీ వేదాంత గ్రూప్ తో పాటు హిందుస్తాన్ జింక్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఈ నివేదిక ప్రభావంతో వేదాంత గ్రూప్‌కు చెందిన షేర్లు భారీగా పతనమయ్యాయి. వేదాంత షేరు ధరలు 7.7% వరకు క్షీణించి రూ. 421 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఇక హిందుస్తాన్ జింక్ షేర్లు కూడా 4.8% క్షీణించి రూ.415.30 వద్ద ట్రేడ్ అయ్యాయి.
వైస్రాయ్ రీసెర్చ్ విడుదల చేసిన 87 పేజీల నివేదికలో వేదాంత గ్రూప్‌ను ఒక పోంజీ స్కీమ్ తో పోల్చింది. వేదాంత లిమిటెడ్ మాతృసంస్థ వేదాంత రిసోర్సెస్ (VRL) కు సొంత వ్యాపారం లేదు. వేదాంత లిమిటెడ్ (VEDL) నుంచి డబ్బును తీసుకుంటూ తన అప్పులను చెల్లిస్తున్నట్లు నివేదికలో ఆరోపించింది. ఇది కంపెనీ అసలు విలువను దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొంది.

వైస్రాయ్ తెలిపిన నివేదిక ప్రకారం.. గత మూడు సంవత్సరాల్లో వేదాంత లిమిటెడ్ 5.6 బిలియన్ డాలర్ల నగదు లోటును ఎదుర్కొంది. అయినప్పటికీ VRL డివిడెండ్ డిమాండ్లను తీర్చేందుకు అప్పులు తీసుకుని డబ్బు చెల్లించిందని నివేదికలో పేర్కొంది. ఇది నిజమైన నగదు ప్రవాహంతో కాదని అప్పులతో ఇలా చేసిందని తెలిపింది.వైస్రాయ్ ఆరోపణల ప్రకారం, VRL అధిక డివిడెండ్లు ఇవ్వమని VEDL పై ఒత్తిడి తెస్తోంది. కానీ, డివిడెండ్లకు అవసరమైన నగదు ప్రవాహం లేకపోవడంతో, VEDL మరిన్ని అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో కంపెనీ ఆర్థిక భారంలో కూరుకుపోతోందని తెలిపింది.
ఈ పరిణామాలతో VEDL పెట్టుబడిదారులు, VRL అప్పు ఇచ్చిన వారు ఇద్దరూ ప్రమాదంలో ఉన్నారు. VEDL విలువ అంతకంతకూ తగ్గిపోతుందని చివరికి ఇది దివాలా పరిస్థితికి దారి తీస్తుందని నివేదిక హెచ్చరించింది. ఇక Vedanta గ్రూప్‌పై మరో సంచలన ఆరోపణ చేసింది. కంపెనీ తన ఆస్థి విలువలను అధికంగా చూపిస్తూ, ఖర్చులను తన బ్యాలెన్స్ షీట్ లో నుండి దాచేస్తోందని ఆరోపించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వేదాంత రిసోర్సెస్ అప్పు పై వడ్డీ ఖర్చులు 835 మిలియన్ డాలర్లు ఉన్నాయని, ఇది కంపెనీ వెల్లడించిన 9-11 శాతం వడ్డీ రేటుతో సరిపోవడం లేదని ఆరోపించింది. వాస్తవానికి వడ్డీ రేటు 15.8 శాతానికి కి చేరిందని పేర్కొంది.
వేదాంత కంపెనీలు బ్రాండ్ ఫీజుల పేరిట వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయని వైస్రాయ్ ఆరోపించింది. FY24లో మాత్రమే వేదాంత లిమిటెడ్ నుండి 338 మిలియన్ డాలర్లు బ్రాండ్ ఫీజులు వసూలు చేసి..ఆ డబ్బుతో VRL విదేశీ క్రెడిట్ లైన్లను పొందిందని తెలిపింది. అదే సమయంలో వేదాంత లిమిటెడ్ కంపెనీల ద్వారా VRL షేర్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన లోన్లను గుర్తు చేస్తూ..ఇవి తిరిగి చెల్లించబడలేదని ఆరోపించింది. 2020లో దాదాపు రూ. 7,934 కోట్ల లోన్ ఈ విధంగా ఉపయోగించినట్లు తెలిపింది.
వేదాంత గ్రూప్ లో భాగమైన హిందుస్తాన్ జింక్ పై కూడా వైస్రాయ్ తన నివేదికలో ఆరోపణలు గుప్పించింది.కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించకపోవడం ద్వారా భారత ప్రభుత్వంతో ఒప్పంద ఉల్లంఘన జరిగిందని పేర్కొంది. దీని వల్ల కంపెనీపై 10.66 బిలియన్ డాలర్ల వరకు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
వైస్రాయ్ ఆరోపణలపై వేదాంత గట్టిగా స్పందించింది. ఈ ఆరోపణలను కంపెనీ ప్రతిష్ఠను దిగజార్చే తప్పుడు ప్రచారంగా అభివర్ణించింది. మార్కెట్‌ను గందరగోళపరిచేందుకు, షార్ట్ సెల్లింగ్ లాభాల కోసం వైస్రాయ్ ఇలాంటి ఆరోపణలు చేసిందని వేదాంత మండిపడింది.వైస్రాయ్ ఆరోపణల నేపథ్యంలో.. మార్కెట్లలో వేదాంత గ్రూప్ పట్ల భయభ్రాంతులు వ్యక్తమయ్యాయి.
గతంలో అదానీ గ్రూప్ విషయమై ఎదురైన అనుభవాల కారణంగా.. ఇలాంటి నివేదికలు పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వేదాంత లిమిటెడ్‌కు అప్పు ఇచ్చిన బ్యాంకులు, బాండ్ హోల్డర్లు, చిన్న పెట్టుబడిదారులంతా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications