Multibagger Stock: భారీ రాబడి అందిస్తోన్న ఆటో విడిభాగాల తయారీ కంపెనీ..
స్టాక్ మార్కెట్ లో కొన్ని స్టాక్స్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందిస్తాయి. అందులో వారోక్ ఇంజనీరింగ్ ఒకటి. వారోక్ ఇంజనీరింగ్ తన మొదటి త్రైమాసిక (Q1) ఫలితాలను ప్రకటించిన తర్వాత కంపెనీ షేర్ ధర 11 శాతానికి పైగా పెరిగింది. బీసీఈలో ఈ స్టాక్ 11.65 శాతం వరకు ఎగబాకి, ఒక్కో షేరుకు రూ. 822 వద్ద సరికొత్త 52-వారాల గరిష్ట స్థాయిని తాకింది. ఆటో విడిభాగాల తయారీ సంస్థ అయిన వారోక్ ఇంజనీరింగ్ FY27 మొదటి త్రైమాసికంలో రూ. 77.3 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ. 105.1 కోట్లతో పోలిస్తే 26.5 శాతం తక్కువ. Q1FY27లో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) 29.9 శాతం పెరిగి రూ. 2,027.6 కోట్ల నుంచి రూ. 2,634.2 కోట్లకు చేరింది.
"FY27 మొదటి త్రైమాసికంలో, అన్ని ఆటోమోటివ్ విభాగాలలోనూ బలమైన వృద్ధిని చేశాం. ఏడాది ప్రాతిపదికన చూస్తే, ద్విచక్ర వాహనాల విభాగం 22.8%, త్రిచక్ర వాహనాల విభాగం 39.1%, ప్యాసింజర్ వాహనాలు (PV) 16.8%, వాణిజ్య వాహనాలు (CV) 15.2% వృద్ధిని నమోదు చేశాయి. ఎలక్ట్రిక్ వాహనాల (EV) ద్విచక్ర వాహనాల అమ్మకాల పరిమాణం ఏడాది ప్రాతిపదికన 91 శాతం పెరిగింది" అని వారోక్ ఇంజనీరింగ్ సీఎండీ తరంగ్ జైన్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల (EV) ద్విచక్ర వాహనాల అమ్మకాల పరిమాణం ఏడాది ప్రాతిపదికన 91 శాతం పెరిగిందని గుర్తు చేశారు.

వారోక్ ఇంజనీరింగ్ షేరు ధర ఒక నెలలో 22 శాతం పెరిగింది. మూడు నెలల్లో 40 శాతం పెరిగింది. ఈ స్టాక్ గత ఏడాది కాలంలో 43 శాతం లాభపడగా, ఐదేళ్లలో 140 శాతం మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. విదేశీ విస్తరణ, బ్యాలెన్స్ షీట్ ఒత్తిడి, నిర్దిష్ట కస్టమర్లపై అధిక ఆధారపడటం వంటి అంశాల వల్ల వారోక్ ఇంజనీరింగ్ గతంలో ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు విదేశీ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ పూర్తవ్వడం, అప్పుల భారం తగ్గడం, క్రమబద్ధమైన వృద్ధిపై యాజమాన్యం దృష్టి సారించడంతో, ఆ పాత సమస్యలు చాలా వరకు తొలగిపోయాయని చెబుతున్నారు.
తద్వారా కంపెనీ దీర్ఘకాలిక పెట్టుబడి సామర్థ్యం మెరుగుపడిందని ఈక్విరస్ సెక్యూరిటీస్ పేర్కొంది. 2028,2029 సంవత్సరాలకు గాను తమ ఆదాయ అంచనాలను వరుసగా 7 శాతం, 10 శాతం మేర పెంచింది. ఇది వారోక్ ఇంజనీరింగ్ షేర్లపై 'లాంగ్' రేటింగ్‌ను కొనసాగిస్తూ, సెప్టెంబర్ 2027 నాటికి ఒక్కో షేరుకు రూ. 897 టార్గెట్ ప్రైస్ ను నిర్దేశించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications