నమ్మిన టెక్నాలజీ నట్టేట ముంచితే.. తల బాదుకుంటున్న అమెరికా.. Wall Streetలో బ్లడ్‌బాత్..

US Stock Market Crash: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతపై టెక్ కంపెనీలు విపరీతంగా చేస్తున్న మూలధన వ్యయాలకు (CapEx) తగ్గట్లుగా రాబడులు రాకపోవడం, నిరాశాజనకమైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం (అక్టోబర్ 30) నాడు యూఎస్ స్టాక్ మార్కెట్ విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి గురైంది.

విదేశీ విపణిలో ప్రధానంగా టెక్నాలజీ షేర్లు తీవ్రంగా దెబ్బతినడంతో వాల్ స్ట్రీట్ బెంచ్‌మార్క్ సూచీలు విలవిలలాడాయి. నెలాఖరు ముగింపుతో పాటు వచ్చే వారం జరగనున్న అత్యంత కీలకమైన అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (Profit Booking) దిగడంతో మధ్యాహ్నం ట్రేడింగ్ సమయంలో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి.

నాస్‌డాక్ కాంపోజిట్ (Nasdaq Composite): ఏకంగా 2.86 శాతం (747.72 పాయింట్లు) క్షీణించి 25,436.99 వద్ద ముగిసింది. గడిచిన జూన్ నెల తర్వాత నాస్‌డాక్‌కు ఇదే అత్యంత దారుణమైన ఒక్కరోజు పతనం కాగా, ఇది తన రికార్డు గరిష్ఠ స్థాయి కంటే సుమారు 8 శాతం దిగువకు పడిపోయింది.

Wall Street bloodbath Nasdaq loses 747 points Dow Jones falls 572 points US stock market crash Nasdaq today Dow Jones today AI stocks crash AI selloff Intel stock plunge Amazon stock fall Nvidia shares AI spending concerns Wall Street selloff US stock market October 30 2026 Nasdaq monthly performance global stock market news 747 572

ఎస్&పి 500 (S&P 500): 1.8 శాతం పతనమై నష్టాల్లో క్లోజ్ అయింది.

డౌ జోన్స్ (Dow Jones): 572 పాయింట్లు (1.1 శాతం) పడిపోయింది.

నాస్‌డాక్ ఇండెక్స్ అక్టోబర్ నెల మొత్తానికి 5 శాతం క్షీణతను నమోదు చేసే దిశగా పయనిస్తోంది. ఇది మార్చి 2025 తర్వాత మార్కెట్‌కు అత్యంత తీవ్రమైన నెలవారీ పతనంగా మారనుంది.

పర్సనల్ కంప్యూటర్ (PC) మార్కెట్‌లో మందగమనాన్ని కారణంగా చూపుతూ చిప్‌మేకింగ్ దిగ్గజం ఇంటెల్ (Intel) షేర్లు ఏకంగా 29 శాతం కుప్పకూలాయి. కంపెనీ క్లయింట్ కంప్యూటింగ్, ఫిజికల్ ఏఐ గ్రూప్ ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే 5 శాతం తగ్గి $8.1 బిలియన్లకు పడిపోవడంతో పాటు.. తదుపరి త్రైమాసికానికి దారుణమైన గైడెన్స్ ఇవ్వడమే ఈ పతనానికి కారణం.

Also Read

మరోవైపు, వాల్ స్ట్రీట్ అంచనాల కంటే తక్కువ ఆదాయాన్ని ప్రకటించి, $42.4 బిలియన్ల ప్రతికూల ఉచిత నగదు ప్రవాహాన్ని (Negative Free Cash Flow) వెల్లడించిన అమెజాన్ (Amazon) షేరు 1 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. వీటితో పాటు అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్ (AMD) 11 శాతం, ఎన్విడియా 4 శాతం, బ్రాడ్‌కామ్ 5 శాతం మరియు సానుకూల ఫలితాలు ఇచ్చినా శాండిస్క్ షేరు 13 శాతం మేర నష్టపోయాయి.

ఏఐ విప్లవంలో ముందున్న ప్రముఖ కంపెనీ ఆంత్రోపిక్ (Anthropic) రాబోయే ఐపీఓ (IPO) తర్వాత ఇన్వెస్ట్‌మెంట్-గ్రేడ్ క్రెడిట్ రేటింగ్‌ను పొందలేకపోవచ్చని, దానికి బదులుగా 'హై జంక్ రేటింగ్' లభించే ప్రమాదం ఉందంటూ బ్లాక్‌స్టోన్ ఇన్వెస్టర్లను హెచ్చరించినట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్' నివేదించింది. ఈ వార్త ఏఐ రంగానికి ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని కోర్‌వీవ్ (CoreWeave) షేరు అక్టోబర్‌లో 37 శాతం, నెబియస్ 33 శాతం, రౌండ్‌హిల్ మెమరీ ఈటీఎఫ్ 20 శాతం మరియు ఐషేర్స్ ఏఐ ఇన్నోవేషన్ ఈటీఎఫ్ 17 శాతం మేర నెలాఖరు నాటికి నష్టపోయాయి.

టెక్నాలజీ స్టాక్స్ కుప్పకూలడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన హెల్త్‌కేర్, కన్స్యూమర్ స్టేపుల్స్ రంగానికి మళ్లారు. వాల్‌మార్ట్, కోకా-కోలా షేర్లు 1% పైగా పెరిగి డౌ జోన్స్ నష్టాలను తగ్గించాయి. మెర్క్, ఆమ్జెన్ కూడా రాణించాయి. కన్స్యూమర్ స్టేపుల్స్ ఈటీఎఫ్ 2% పెరిగి ఆల్‌టైమ్ రికార్డుకు చేరగా, హెల్త్‌కేర్ ఈటీఎఫ్ 1.5% లాభపడింది. అంతర్జాతీయంగా జపాన్ నిక్కీ 2.12%, దక్షిణ కొరియా కోస్పి 3.48% మరియు చైనా సీఎస్ఐ 300 సూచీ 1.39% నష్టాలతో ముగిశాయి. ఏఐ పెట్టుబడులను కంపెనీలు ఎంతవరకు లాభాలుగా మలుచుకోగలవనే అంశంపై ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+