United Heat Transfer IPO: అక్టోబర్ నెల చివరికి వచ్చిన నేపథ్యంలో మార్కెట్లో ఐపీవోల రద్దీ కొంత తగ్గింది. ఈ క్రమంలో ఐపీవో ఓపెనింగ్స్ తగ్గినప్పటికీ లిస్టింగుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. నిన్న మార్కెట్లోకి రెండు ఐపీవోలు జాబితా కాగా నేడు మరో ఐపీవో లిస్ట్ అయ్యింది. మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్న వేళ నిరాశాజనకమైన లిస్టింగ్ మంగళవారం బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది యునైటెడ్ హీట్ ట్రాన్స్‌ఫర్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన చిన్న కంపెనీ షేర్లు తొలిరోజు స్వల్పంగా 3.31 శాతం ప్రీమియంతో రూ.60.95 వద్ద మార్కెట్‌లో ఫ్లాట్ లిస్టింగ్ నమోదు చేశాయి. జాబితా తర్వాత అమ్మకాల ఒత్తిడి కొనసాగటంతో ఐపీవో కంపెనీ షేర్లు దాదాపు 4 శాతం కంటే ఎక్కువ క్షీణతను చూశాయి. దీంతో ఇంట్రాడేలో స్టాక్ ధర రూ.57.95కి చేరుకున్నాయి. వాస్తవానికి కంపెనీ ఇష్యూ ధర కంటే కిందకు షేర్ల ధర దిగజారటంతో ఐపీవోపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు నష్టాలను చూస్తున్నారు. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఐపీవోలో పెట్టుబడులు పెట్టిన చాలా మంది పూర్తిగా నిరాశచెందారు.

కంపెనీ రిటైల్ పెట్టుబడిదారుల కోసం తన ఐపీవోను అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.56-59గా నిర్ణయించింది. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో కంపెనీ షేర్లు నేడు లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. కంపెనీ తన లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా ఉంచటంతో ఇన్వెస్టర్లు కనీసం రూ.1.18 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. ఈ ఐపీవోలో కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.30 కోట్లను విజయవంతంగా సేకరించింది. ఈ క్రమంలో పెట్టుబడిదారులకు 50.84 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఇదే క్రమంలో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8.46 కోట్లను సమీకరించింది.
యునైటెడ్ హీట్ ట్రాన్స్‌ఫర్ ఐపీవో మూడు రోజుల సబ్‌స్క్రిప్షన్ సమయంలో మెుత్తంగా 83.70 రెట్లు దరఖాస్తులు అందుకుంది. ఇదే క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 98.93 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విభాగం 124.72 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ కేటగిరీ 26.56 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. గడచిన త్రైమాసికంలో కంపెనీ మెుత్తం పూర్తి స్థాయి ఉద్యోగుల సంఖ్య 105 మందిని కలిగి ఉండగా.
ఇదే సమయంలో 127 మంది కాంట్రాక్టు ఉద్యోగులను కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఐపీవో సొమ్మును రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, కార్పొరేట్ ప్రయోజనాల కోసం కంపెనీ వినియోగించాలని నిర్ణయించింది. జనవరి 1995లో స్థాపించబడిన యునైటెడ్ హీట్ ట్రాన్స్‌ఫర్స్ హీట్ ఎక్స్‌చేంజర్స్, ప్రెజర్ వాల్వ్స్, ప్రాసెస్ ఫ్లో స్కిడ్‌లు వంటి అవసరమైన పరికరాలను తయారు చేస్తుంది. కంపెనీ ఉత్పత్తులు పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్లు, సముద్ర నౌకలు, మైనింగ్ ట్రక్కులు, భారీ యంత్రాల్లో వినియోగిస్తుంటారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications