Unimech Aerospace IPO: డిసెంబర్ చివరి రోజును ఐపీవో ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది. దీంతో స్టాక్ మార్కెట్ల పతనంలోనూ దేశీయ స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు తమ అదృష్టాన్ని ఐపీవోల రూపంలో కొనసాగిస్తూ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టడానికి ప్రస్తుతం సిద్ధం అవుతున్నారు.
మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది మెయిన్ కేటగిరీలో ఐపీవోగా వచ్చిన యునిమెక్ ఏరోస్పేస్ కంపెనీ ఐపీవో గురించే. నేడు కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో జాబితా అయ్యాయి. బీఎస్ఈలో కంపెనీ షేర్లు 89.94 శాతం ప్రీమియం ధర రూ.1,491 వద్ద జాబితా కాగా, ఎన్ఎస్ఈలో స్టాక్ 85.9 శాతం ప్రీమియం రేటు రూ.1,460 వద్ద గ్రాండ్ ఎంట్రీని నమోదు చేసింది. అయితే లిస్టింగ్ తర్వాత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మెగ్గుచూపడంతో దాదాపు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 9 శాతం వరకు పతనాన్ని చూస్తున్నాయి. ఉదయం 10.11 గంటల సమయంలో బీఎస్ఈలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.1355.05 వద్ద తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

యునిమెక్ ఏరోస్పేస్ ఐపీవో మూడు రోజుల బిడ్డింగ్ క్లోజింగ్ సమయానికి 184.34 సార్లు సభ్యత్వం పొందింది. ఈ క్రమంలో రిటైల్ కేటగిరీ 59.19 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్టిట్యూషనల్ బయ్యర్స్ కేటగిరీ 334.68 రెట్లు, నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో 277.55 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. మెయిన్ కేటగిరీలో వచ్చిన కంపెనీ ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.500 కోట్లు సమకరించే లక్ష్యంతో ప్రారంభమైంది. తాజా ఐపీవోలో రూ.250 కోట్లకూ తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూ ఉండగా.. మిగిలిన మెుత్తాన్ని కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ కింద కంపెనీ రైజ్ చేసింది. వాస్తవానికి గ్రేమార్కెట్లో అందరూ ఊహించిన దానికంటే బలమైన లిస్టింగ్ నేడు కంపెనీ షేర్లు నమోదు చేశాయి.
ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 26 వరకు అందుబాటులో ఉండనుంది. అయితే కంపెనీ ఐపీవో లిస్టింగ్ డిసెంబర్ 31, 2024న జరగవచ్చని ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఐపీవో కోసం కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.745-785గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 19 షేర్లుగా నిర్ణయించటంతో ఇన్వెస్టర్లు ఒక లాట్ కొనుగోలు కోసం రూ.14,915 వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ ప్రమోటర్లుగా అనిల్ కుమార్ పి, రామకృష్ణ కమోఝల, మణి పి, రజనీకాంత్ బలరామన్, ప్రీతం ఎస్వీ వ్యవహరిస్తుండగా.. వారికి కంపెనీలో 91.83% వాటాను హోల్డ్ చేస్తున్నారు.
కంపెనీ వ్యాపారం..
యునిమెక్ ఏరోస్పేస్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ అనేది గ్లోబల్ హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ సొల్యూషన్ కంపెనీ. ఇది "బిల్డ్ టు ప్రింట్", "బిల్డ్ టు స్పెసిఫికేషన్" సేవలను అందిస్తోంది. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా మ్యాచింగ్, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్, కొత్త ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ ఉంటాయి. ఇది కాంప్లెక్స్ టూలింగ్, మెకానికల్ అసెంబ్లీలు, ఎలక్ట్రో-మెకానికల్ టర్న్‌కీ సిస్టమ్స్, ప్రెసిషన్ కాంపోనెంట్స్‌లో ప్రముఖ తయారీదారుగా గుర్తింపు తెచ్చుకుంది. కంపెనీ తన ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా 7 దేశాల్లోని వినియోగదారులకు సరఫరా చేస్తోంది. ఏరోస్పేస్ భాగాలను ఎగుమతిలో గుర్తింపును తెచ్చుకుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications