IPO News: తెలివైన ఇన్వెస్టర్స్ అస్సలు వదులుకోని ఐపీవో.. 4 రోజులే టైమ్, 50 శాతం లాభం పక్కా!
Unimech Aerospace IPO: ఐపీవోల ద్వారా మంచి రాబడులను పొందాని భావించే ఇన్వెస్టర్లకు మంచి రోజులు మిగిలే ఉన్నాయ్. అవును ప్రస్తుతం డిసెంబర్ నెల చివరికి వస్తున్న సమయంలో అనేక క్రేజీ ఐపీవోలు పెట్టుబడిదారులను ఊరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఓపెన్ కాక మునుపే గ్రేమార్కెట్లో తమ సత్తా చాటుకుంటూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి.
వివరాల్లోకి వెళితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది త్వరలోనే డిసెంబర్ 23న ప్రారంభం కానున్న యునిమెక్ ఏరోస్పేస్ కంపెనీ ఐపీవో గురించే. డిసెంబరు నెలలో బ్యాక్ టూ బ్యాక్ ఐపీవోలు వస్తున్నప్పటికీ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీపై ఇన్వెస్టర్ల ఫోకస్ కొనసాగుతోంది. మెయిన్ కేటగిరీలో వస్తున్న కంపెనీ ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.500 కోట్లు సమకరించే లక్ష్యంతో ప్రారంభం కానుంది. తాజా ఐపీవోలో రూ.250 కోట్లకూ తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూ ఉండగా.. మిగిలిన మెుత్తాన్ని కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయానికి ఉంచుతోంది.

ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో లిస్టింగ్ కోసం వస్తున్న కంపెనీ షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 26 వరకు అందుబాటులో ఉండనుంది. అయితే కంపెనీ ఐపీవో లిస్టింగ్ డిసెంబర్ 31, 2024న జరగవచ్చని ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఐపీవో కోసం కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.745-785గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 19 షేర్లుగా నిర్ణయించటంతో ఇన్వెస్టర్లు ఒక లాట్ కొనుగోలు కోసం రూ.14,915 వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ ప్రమోటర్లుగా అనిల్ కుమార్ పి, రామకృష్ణ కమోఝల, మణి పి, రజనీకాంత్ బలరామన్, ప్రీతం ఎస్వీ వ్యవహరిస్తుండగా.. వారికి కంపెనీలో 91.83% వాటాను హోల్డ్ చేస్తున్నారు.
ప్రస్తుతం పెట్టుబడిదారుల నుంచి ఐపీవోకి బలమైన స్పందన లభించటంతో ప్రారంభానికి ముందే గ్రేమార్కెట్లో షేర్లపై 51.59 శాతం ప్రీమియం పలుకుతోంది. ఈ లెక్కన కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.405 గ్రేమార్కెట్ ప్రీమియం కలిగి ఉన్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం లిస్టింగ్ సమయం వరకు ఇదే జోరు కొనసాగితే ఒక్కో షేరు రూ.1190 వద్ద మార్కెట్లో జాబితా అయ్యే అవకాశం ఉందని ఇన్వెస్టర్ గెయిన్ సమాచారం ప్రకారం తెలుస్తోంది.
కంపెనీ వ్యాపారం..
యునిమెక్ ఏరోస్పేస్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ అనేది గ్లోబల్ హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ సొల్యూషన్ కంపెనీ. ఇది "బిల్డ్ టు ప్రింట్", "బిల్డ్ టు స్పెసిఫికేషన్" సేవలను అందిస్తోంది. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా మ్యాచింగ్, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్, కొత్త ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ ఉంటాయి. ఇది కాంప్లెక్స్ టూలింగ్, మెకానికల్ అసెంబ్లీలు, ఎలక్ట్రో-మెకానికల్ టర్న్‌కీ సిస్టమ్స్, ప్రెసిషన్ కాంపోనెంట్స్‌లో ప్రముఖ తయారీదారుగా గుర్తింపు తెచ్చుకుంది. కంపెనీ తన ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా 7 దేశాల్లోని వినియోగదారులకు సరఫరా చేస్తోంది. ఏరోస్పేస్ భాగాలను ఎగుమతిలో గుర్తింపును తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications