71 ఏళ్ల టిటి గ్రూప్ సంస్థ టిటి లిమిటెడ్ కాటన్, యార్న్, ఫ్యాబ్రిక్ వంటి ఉత్పత్తులతో టెక్స్టైల్స్, దుస్తులను తయారుచేస్తుంది. ఈ కంపెనీ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ అలాగే ISO 9001 సర్టిఫికేషన్ తో త్రి స్టార్స్ ఎక్స్పోర్ట్ హౌస్. కంపెనీ ఇండియా మొత్తంలో 25 స్టోర్లను నిర్వహిస్తోంది. గజ్రౌలా (యుపి), అవినాశి (తమిళనాడు), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్) ఇంకా రాజులా (గుజరాత్)లో కంపెనీ ప్రొడక్షన్ ప్లాంట్ల ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ న్యూఢిల్లీ కేంద్రంగా కార్యాకలాపాలను నిర్వహిస్తుంది. జూన్ 2024 నాటికి ఈ కంపెనీలో సుమారు 342 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన టీటీ లిమిటెడ్ షేర్ హోల్డర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. తాజాగా జరిగిన కంపెనీ బోర్డు అఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ కి ఆమోదం తెలిపినట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఈ స్టాక్ స్ప్లిట్ కి సంబంధించిన రికార్డు డేట్ ని మాత్రం త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ స్టాక్ స్ప్లిట్ అనేది కంపెనీ చరిత్రలోనే మొట్ట మొదటి స్టాక్ స్ప్లిట్ కావడం విశేషం. మరొకవైపు ఈ కంపెనీ షేరు గత ఏడాది కాలంలో 55% లాభాన్ని అందించింది. ప్రస్తుతం సుమారు రూ. 160 లుగా ఉన్న షేర్ ధర రూ. 16లకి తగ్గనుంది.

కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం సెక్షన్ 61 (2013) అనుగుణంగా జరిగిన కంపెనీ బోర్డు అఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ కి ఆమోదం తెలుపడం జరిగిందని, రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక ఈక్విటీ షేరుని రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 10 షేర్లుగా స్ప్లిట్ చేయడానికి డైరెక్టర్స్ బోర్డు ఆమోదం తెలిపిందని అయితే ఈ స్టాక్ స్ప్లిట్ కి సంబంధించిన రికార్డు డేట్ మాత్రం త్వరలో నిర్ణయించనున్నట్లు కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో తెలిపింది.
TT Ltd ప్రకారం స్టాక్ స్ప్లిట్ వెనుక ఉన్న కారణం ఏమిటంటే, కంపెనీ ఈక్విటీ షేర్ల లిక్విడిటీని మెరుగుపరచడం ఇంకా రిటైల్ ఇన్వెస్టర్ల స్థావరాన్ని విస్తృతం చేయడానికి మరింత సరసమైనదిగా చేయడం ద్వారా చిన్న పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. తాజా ట్రేడింగ్ సెషన్ లో టీటీ లిమిటెడ్ షేరు ధర 1 శాతం లాభాపడి రూ. 157.50 వద్ద ట్రేడ్ ఉండగా ఈ షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 184.95, అలాగే 52 వారాల కనిష్ట ధర రూ. 95.80గా ఉంది. గత వారం రోజులలో ఈ షేరు సుమారు 8 శాతం నష్టాన్ని, గత నెల రోజులల్లో సుమారు 3 శాతం నష్టాన్ని, అదే విధంగా గత ఆరు నెలల్లో ఈ షేరు సుమారు 34 శాతం లాభాన్ని, గత ఏడాది కాలంలో ఈ షేరు 55 శాతం లాభాన్ని, గత 5 సంవత్సరాలలో 299 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు రూ. 354 కోట్లు.
Disclaimer The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies. The author, nor the brokerage firm nor Greynium would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications