ట్రంప్ సుంకాలు, ఫెడ్ పాలసీతో భారతదేశానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్లలో ఐటీ, మెటల్, రియల్టీ షేర్లకు భారీ దెబ్బ పడింది. ఈరోజు జూలై 31 ఉదయం ట్రేడింగ్‌లో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 25 శాతం దిగుమతి సుంకాలు, అదనపు జరిమానాలతో పాటుగా ఫెడరల్ రిజర్వ్ FOMC సమావేశం అనంతరం తీసుకున్న వడ్డీ రేట్ల నిర్ణయాలు భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్, రియల్టీ రంగాల మీద ఈ ప్రభావం భారీగా పడటంతో ఈ రంగాల షేర్లు 4 శాతం వరకు పతనమయ్యాయి.
ఈ పరిణామాలతో బెంచ్‌మార్క్ సూచీలు కూడా క్షీణించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 460 పాయింట్లు తగ్గి 81,022 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 141 పాయింట్లు నష్టపోయి 24,714 పాయింట్ల వద్ద స్థిరపడింది. దీంతో పెట్టుబడిదారుల నమ్మకం తీవ్రంగా దెబ్బతింది.ఇక ఐటీ రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ వంటి ప్రధాన కంపెనీలు 2-3 శాతం వరకూ నష్టపోయాయి.మెటల్ రంగంలో టాటా స్టీల్, హెండాల్‌కో, JSW స్టీల్ వంటి స్టాక్స్ దాదాపు 4 శాతం వరకు క్షీణించాయి. అలాగే రియల్టీ రంగానికి చెందిన డిఎల్‌ఎఫ్, ఒబెరాయ్ రియల్టీ, గాడ్రెజ్ ప్రాపర్టీస్ షేర్లు కూడా గణనీయంగా తగ్గుదలను నమోదు చేశాయి.

అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) జూలై 30న ముగిసిన రెండు రోజుల సమావేశంలో వడ్డీ రేట్లను 4.25 శాతం నుండి 4.5 శాతానికి మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇది ఇన్వెస్టర్లలో మిశ్రమ ఆలోచనలు రేకెత్తించింది. వడ్డీ రేట్లు పెరిగే సూచనలు లేకపోయినా..అమెరికా ఆర్థిక పరిస్థితులపై కేంద్ర బ్యాంకు స్వల్ప అనుమానాలు వ్యక్తం చేయడం మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి.
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో భారత్‌ను మిత్రుడు అంటూనే రష్యాతో భారత్ వ్యాపార సంబంధాలు కొనసాగిస్తుండటాన్ని తప్పుపట్టడం కూడా మార్కెట్ పై ప్రభావం చూపింది.భారత్ మీద 25 శాతం సుంకాలు జరిమానాలను విధించారు. ఈ ప్రకటన మార్కెట్లపై పెట్టుబడిదారుల మూడ్‌ను మరింత కష్టాల్లోకి నెట్టింది. దీంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి వెనుకంజ వేశారు. బలహీనమైన గ్లోబల్ క్యూస్ మధ్య లాభాలు తీసుకుని బయటపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముండటంతో, స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలోనే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications