2025 ఆరంభం మాత్రమే! 2026లో అసలైన IPOల సునామీ.. మీ పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేసుకోండి!
2025లో భారతీయ స్టాక్ మార్కెట్ ఎన్నో రికార్డు బ్రేకింగ్ ఐపీఓ(IPO) లను చూసింది. అయితే అసలు సిసలైన పండుగ 2026లో రాబోతోంది. సుమారు రూ. 2.5 లక్షల కోట్ల నిధులను సేకరించేందుకు 190కి పైగా కంపెనీలు క్యూ కడుతున్నాయి. మార్కెట్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. సెబీ ఇప్పటికే 84 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మరో 100కు పైగా కంపెనీలు అనుమతుల కోసం వేచి చూస్తున్నాయి. వచ్చే ఏడాది ఇన్వెస్టర్ల రాతను మార్చబోతున్న ఆ టాప్ 10 ఐపీఓల వివరాలు ఇప్పుడు చూద్దాం.

2026లో రాబోఐఏ టాప్ 10.. IPOలు..
రాబోయే ఏడాదిలో భారత మార్కెట్ గమనాన్ని మార్చబోతున్న కంపెనీలు ఇవే..
- రిలయన్స్ జియో (Reliance Jio IPO): ఇది భారత మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ(IPO) కాబోతోంది. సుమారు 170 బిలియన్ డాలర్ల విలువతో 2026 మొదటి సగభాగంలోనే ఇది లిస్ట్ అయ్యే అవకాశం ఉందని ముకేశ్ అంబానీ సంకేతాలు ఇచ్చారు.
- ఎన్ఎస్ఈ (NSE IPO): ఎంతో కాలంగా ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న ఎన్ఎస్ఈ ఐపీఓ ఎట్టకేలకు 2026లో వెలుగు చూడనుంది. ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో దీని షేర్లు రూ. 1,950 వద్ద ట్రేడవుతున్నాయి.
- ఫ్లిప్‌కార్ట్ (Flipkart IPO): ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కూడా త్వరలోనే పబ్లిక్ లిస్టింగ్ కోసం సిద్ధమవుతోంది.
- ఫోన్ పే (PhonePe IPO): బెంగళూరుకు చెందిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ సుమారు రూ. 12,000 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- జెప్టో (Zepto IPO): క్విక్ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న జెప్టో.. త్వరలోనే సుమారు $500 మిలియన్ల ఐపీఓతో మార్కెట్లోకి రానుంది.
- ఓయో (Oyo IPO): ఈ హాస్పిటాలిటీ ప్లాట్‌ఫామ్ సుమారు 7-8 బిలియన్ డాలర్ల వ్యాల్యూయేషన్‌తో ఐపీఓ(IPO) కు సిద్ధమవుతోంది.
- బోట్ (boAT IPO): ఆడియో, వేరబుల్ బ్రాండ్ పేరెంట్ సంస్థ 'ఇమాజిన్ మార్కెటింగ్' రూ. 1,500 కోట్లు సేకరించేందుకు సెబీ అనుమతి పొందింది.
- హీరో ఫిన్‌కార్ప్ (Hero FinCorp IPO): సుమారు రూ. 3,600 కోట్లతో ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో బలమైన ఎంట్రీ ఇవ్వబోతోంది.
- ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ (SBI Mutual Fund IPO): ఎస్బీఐ గ్రూప్ నుంచి రాబోతున్న ఈ భారీ ఐపీఓపై ఇన్వెస్టర్లలో భారీ అంచనాలు ఉన్నాయి.
- కార్ దేఖో (CarDekho IPO): కొంతకాలం వాయిదా పడినప్పటికీ, 2026లో ఈ ఆటో-టెక్ కంపెనీ లిస్టింగ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఎందుకు ఈ దూకుడు?
ప్రైమ్ సెక్యూరిటీస్ నివేదికల ప్రకారం.. భారతదేశ ఈక్విటీ మార్కెట్ ఇప్పుడు అత్యంత సమర్థవంతంగా, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే స్థాయికి చేరుకుంది. రెగ్యులేటరీ సంస్కరణలు మరియు డిజిటల్ ఎకానమీ పెరుగుదల వల్ల కొత్త తరం టెక్నాలజీ సంస్థల నుంచి పాతతరం దిగ్గజ కంపెనీల వరకు అందరూ పబ్లిక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. 2026 IPO సైకిల్.. ఇన్వెస్టర్ల మెచ్యూరిటీని అలాగే మార్కెట్ లోతును పరీక్షించబోతోంది.
ఏదేమైనా వచ్చే ఏడాది ముఖ్యంగా రిలయన్స్ జియో వంటి వంటి దిగ్గజాలు మార్కెట్లోకి వస్తే, సెన్సెక్స్, నిఫ్టీలలో భారీ మార్పులు చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఇప్పటి నుంచే తమ పెట్టుబడి వ్యూహాలను సిద్ధం చేసుకోవడం బెటర్!


Click it and Unblock the Notifications