Multibagger Stock: 10 ఏళ్లలో 4,897 శాతం మల్టీబ్యాగర్ రాబడి ఇచ్చిన స్టాక్ ఇదే..!
బుధవారం నాడు టైటాన్ బయోటెక్ లిమిటెడ్ (Titan Biotech Ltd) షేర్లు 9% పెరిగాయి. బోనస్ షేర్ల జారీ కోసం అక్టోబర్ 23, 2026ని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించడంతో ఈ షేర్లలో ర్యాలీ కనిపించింది. కంపెనీ 1:4 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ 1:4 బోనస్ షేర్ల ప్రయోజనాన్ని పొందాలనుకునే పెట్టుబడిదారులు, ఈ వారంలో బుధవారం, గురువారం లోపు టైటాన్ బయోటెక్ షేర్లను కొనుగోలు చేయవచ్చు. ఇక షేర్ల కేటాయింపు తేదీ అక్టోబర్ 26, 2026, సోమవారంగా నిర్ణయించారు. సెప్టెంబర్ 22, 2026న ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కో షేరుకు రూ. 0.50 చొప్పున తుది డివిడెండ్‌ను చెల్లించేందుకు 'ఎక్స్-డివిడెండ్'గా ట్రేడైంది.
స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో ఉన్న టైటాన్ బయోటెక్ షేర్లు గత ఐదేళ్లలో 587 శాతం రాబడిని రెండేళ్లలో 477% రాబడిని అందించాయి. గత 10 ఏళ్ల కాలంలో ఈ కంపెనీ తన వాటాదారులకు 4,897% మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. బోనస్ షేర్ల జారీకి సంబంధించి సెప్టెంబర్ 3న స్టాక్ ఎక్స్ఛేంజీకి సమర్పించిన ఫైలింగ్‌లో కంపెనీ ఇలా పేర్కొంది. సెబీ (LODR) నిబంధనలు 2015లోని రెగ్యులేషన్ 28(1) ప్రకారం, బీఎస్ఈ లిమిటెడ్ తమకు సూత్రప్రాయ ఆమోదం లభించిందని కంపెనీ పేర్కొంది. దీని ద్వారా, కంపెనీలో ఇప్పటికే ఉన్న ప్రతి 4 షేర్లకు 1 కొత్త ఈక్విటీ షేరు చొప్పున రూ. 2 ముఖ విలువ కలిగిన మొత్తం 1,03,29,625 బోనస్ ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నారు.

బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో టైటాన్ బయోటెక్ షేర్లు 9 శాతం పెరిగి రూ. 445కి చేరుకున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,804 కోట్లకు పెరిగింది. ఈ స్టాక్, 2025 డిసెంబర్ 9న నమోదైన 52 వారాల కనిష్ట ధర రూ. 171.40 నుండి 154 శాతం వృద్ధిని సాధించింది. ఇది 2026 ఏప్రిల్ 7న 52 వారాల గరిష్ట ధర అయిన రూ. 555.65కి చేరుకుంది. టైటాన్ బయోటెక్ సంస్థ, ఫార్మాస్యూటికల్స్, న్యూట్రాస్యూటికల్స్, ఆహార, పానీయాల పరిశ్రమలు, బయోటెక్నాలజీ వంటి వివిధ రంగాలలో ఉపయోగించే జీవ ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేస్తుంది. 30 ఏళ్లకు పైగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ, 100కు పైగా దేశాలకు తమ వస్తువులు ఎగుమతి చేస్తోంది. ప్రోటీన్ హైడ్రోలైసేట్లు, పెప్టోన్లు, జీవ సారం వంటి తమ ఉత్పత్తుల శ్రేణిలో కంపెనీ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications