Stock market: పెట్టుబడిదారులకు కాసుల వర్షం! ఒకే నెలలో డబుల్ అయ్యేంతగా పెరిగిన షేర్..
మీరు స్టాక్ మార్కెట్ (Stock Market) లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ మధ్య కాలంలో ఒక ఆప్టికల్ ఫైబర్ స్టాక్ చేస్తున్న హంగామా మీరు గమనించే ఉంటారు. అదే 'HFCL లిమిటెడ్'. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ షేర్ ఏకంగా 84% పైగా పెరిగి ఇన్వెస్టర్ల కళ్ళలో ఆనందం నింపింది. అసలు ఈ భారీ పెరుగుదలకు కారణం ఏంటి? ఈ కంపెనీలో అంతగా ఏం జరుగుతోంది? ఇప్పుడు చూద్దాం.

భారీ ఆర్డర్ల వెల్లువ
HFCL షేర్లు ఇంత వేగంగా పెరగడానికి ప్రధాన కారణం కంపెనీకి వస్తున్న భారీ ఆర్డర్లు. మే 4న ఒక ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ నుండి రూ. 84.23 కోట్ల విలువైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఆర్డర్‌ను కంపెనీ దక్కించుకుంది. అంతకుముందు ఏప్రిల్ 8న ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయిన HTL లిమిటెడ్ ఏకంగా రూ. 1,366 కోట్ల భారీ ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. ఈ వరుస విజయాలు కంపెనీపై ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని పెంచాయి.
నష్టాల నుంచి లాభాల బాటలోకి..
గతేడాది మార్చి త్రైమాసికంలో (Q4) రూ. 81.43 కోట్ల నష్టాల్లో ఉన్న HFCL, ఈ ఏడాది అదే సమయానికి రూ. 178.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదాయం కూడా రూ. 800 కోట్ల నుండి ఏకంగా రూ. 1,824 కోట్లకు పెరిగింది. కంపెనీ తన ఆర్డర్ బుక్ విలువను గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 9,967 కోట్ల నుండి ఇప్పుడు రికార్డు స్థాయిలో రూ. 21,206 కోట్లకు పెంచుకుంది. ఇది కంపెనీ భవిష్యత్తుపై అంచనాలను భారీగా పెంచేసింది.
52 వారాల గరిష్టానికి షేర్ ధర
ఈ రోజు ట్రేడింగ్‌లో HFCL షేర్ ధర రూ. 133.10 కి చేరుకుని 52 వారాల గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా రూ. 20,173 కోట్లకు పెరిగింది. కేవలం 2026 సంవత్సరంలోనే ఈ స్టాక్ ఇప్పటివరకు 92% లాభాలను ఇచ్చింది. 5G నెట్‌వర్క్ విస్తరణ , ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న తరుణంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌కు వస్తున్న డిమాండ్ ఈ కంపెనీకి కలిసి వస్తోంది.
ఏదేమైనా టెలికాం ఎక్విప్‌మెంట్ , ఆప్టికల్ ఫైబర్ తయారీలో అగ్రగామిగా ఉన్న HFCL, తన టెక్నాలజీ , నాణ్యతతో కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుంటోంది. స్టాక్ మార్కెట్ (Stock Market) లో ఈ స్థాయి వృద్ధి చూస్తుంటే, రాబోయే రోజుల్లో కూడా ఈ రంగంపై ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగేలా కనిపిస్తోంది. అలాగే ఈ స్టాక్‌ను మరిన్ని గరిష్టాలకు తీసుకెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్ లో ఇలాంటి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే షేర్ల కోసం చూసే ఇన్వెస్టర్లు ఇలాంటి స్టాక్స్ పై ఓ కన్నేచి ఉంచడం మంచిది. అయితే, మార్కెట్ ఒడిదుడుకుల దృష్ట్యా ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. అయితే, ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ రిస్కులను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications