Jio IPO: దసరా లేదా దీపావళికి జియో ఐపీఓ.. సిద్ధంగా ఉన్నారా..!
అతి పెద్ద ఏపీఓకు రాకకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఐపీఓకు సంబంధించి కొద్ది నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ కోసం సెబీకి డీఆర్హెచ్పీ సమర్పించింది. దీనికి ప్రతిగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం సెబీ అనుమతి ఇచ్చింది. దీంతో జియో ఐపీఓ ఎప్పుడు వస్తుందా అని ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. నేషనల్ మీడియా కథనాల ప్రకారం వచ్చే దసరా లేదా దీపావళికి జియో ఐపీఓ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల మధ్య పండుగ సీజన్‌లో ఐపీఓ వచ్చే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే, నవరాత్రి, దీపావళి పండుగల సందర్భంగా ముఖేష్ అంబానీ ఈ ఐపీఓను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.
ఈ ఐపీఓలో భాగంగా 4 బిలియన్ డాలర్లు అంటే రూ. 37,700 కోట్లకు పైగా నిధుల సమీకరించనున్నారు. ఇంతే స్థాయిలో ఐపీఓకు వస్తే దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా జియో నిలువనుంది. 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా జరిపిన 3.3 బిలియన్ డాలర్ల ఐపీఓ వచ్చింది. జియో ఐపీఓ ఎన్‌ఎస్‌ఈ ప్రతిపాదించిన రూ. 30,000 కోట్ల ఫ్లోట్‌ను కూడా మించిపోయే అవకాశం ఉంది. జియో ఎలాంటి ఆఫర్-ఫర్-సేల్ అంశం లేకుండా కేవలం ప్రైమరీ ఇష్యూ ద్వారానే షేర్లను జారీ చేయాలని భావిస్తోంది. ఈ కంపెనీ ఒక్కో షేరు ముఖ విలువ రూ. 10 చొప్పున 27 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. దీనివల్ల 2.9% ఈక్విటీ డైల్యూషన్ కానుంది. ఇప్పటికే ఉన్న వాటాదారులెవరూ తమ షేర్లను విక్రయించడం లేదు కాబట్టి, వచ్చిన మొత్తం ఆదాయం కంపెనీకే చెందనుంది.

సెబీ కొత్త లిస్టింగ్ నిబంధనల ప్రకారం ప్రమోటర్ వాటాను తగ్గించుకోవాల్సి ఉంటుంది. జియో లిస్టింగ్ తర్వాత రూ. 5 లక్షల కోట్లకు పైగా విలువ ఉన్న కంపెనీగా నిలువనుంది. రిలయన్స్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్ట్ అయింది. అయితే డిమెర్జర్ ద్వారా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. అయితే జియోను మాత్రం ఐపీఓగా తీసుకొస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 2023లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను వేరు చేసి లిస్ట్ చేశారు. మార్చి 31, 2026 నాటికి జియో ప్లాట్‌ఫారమ్స్ రూ. 27,579 కోట్ల నికర రుణాన్ని కలిగి ఉంది. అయితే దేశంలోనే అతిపెద్ద టెలికామ్ సంస్థగా ఉంది.
జియో ప్లాట్‌ఫారమ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కు 66.43% వాటా ఉంది. మిగిలిన 33.57% వాటా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల చేతిలో ఉంది. వీరిలో మెటా ప్లాట్‌ఫారమ్స్ (9.98%), గూగుల్ ఇంటర్నేషనల్ (7.73%), సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (2.31%), కెకెఆర్ (KKR - 2.31%), విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ (2.31%) వంటి సంస్థలు ఉన్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications