Multibagger Stock: ఐదేళ్లలో 514 శాతం రాబడి ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
కెమికల్ రంగంలోని మల్టీబ్యాగర్ స్టాక్ టీజీవీ ఎస్ఆర్ఏఏసీ 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి గాను బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో గురువారం నాటి ట్రేడింగ్‌లో 7.71%కి పైగా లాభపడింది. బుధవారం రూ.120.65 వద్ద ముగిసిన ఈ షేరు గురువారం బీఎస్ఈలో రూ.125.50 వద్ద ప్రారంభమై, నవంబర్ 12న ఇంట్రాడే గరిష్ట ధర రూ.137.80ని తాకింది. 2027 ఆర్థిక సంవత్సరం (FY27) రెండో త్రైమాసికంలో టీజీవీ ఎస్ఆర్ఏఏసీ అద్భుతమైన పనితీరును కనబరిచింది. కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలోని రూ.37.05 కోట్ల నుంచి 50.4% వృద్ధితో రూ.55.72 కోట్లకు చేరుకుంది.
కంపెనీ పన్నుకు ముందు లాభం (PBT) FY26 రెండో త్రైమాసికంలోని రూ.49.89 కోట్ల నుంచి FY27 రెండో త్రైమాసికంలో రూ.76.84 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 18.1 శాతం వృద్ధితో FY27 రెండో త్రైమాసికంలో రూ.590.47 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం కూడా FY26 రెండో త్రైమాసికంలోని రూ.503.18 కోట్ల నుంచి రూ.596.57 కోట్లకు పెరిగింది, ఇది కంపెనీ మొత్తం నిర్వహణ పనితీరులో వృద్ధిని సూచిస్తోంది. నిర్వహణ పరంగా చూస్తే సెప్టెంబర్ త్రైమాసికానికి టీజీవీ ఎస్ఆర్ఏఏసీ ఎబిట్డా రూ.111 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 19.4% పెరుగుదల. దీని ఎబిట్డా మార్జిన్ 18.78 శాతంగా ఉంది. ఇది ఆదాయంతో పాటు నిర్వహణ ఆదాయాలు కూడా మెరుగుపడ్డాయి.

మొత్తంమీద FY27 రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం, నిర్వహణ ఆదాయాలు, లాభదాయకతలో వృద్ధిని నమోదు చేసింది. ఆదాయ వృద్ధితో పోలిస్తే నికర లాభంలో మరింత గణనీయమైన పెరుగుదల కనిపించింది. టీజీవీ ఎస్ఆర్ఏఏసీ షేర్లు గత వారం రోజుల్లో 10.45 శాతం పెరిగాయి. గత రెండు వారాల్లో 15 రాబడి ఇచ్చాయి. అయితే గత నెలలో ఈ షేరు సాధించిన లాభాలు 5.70 శాతానికి పరిమితమయ్యాయి. ఇది ఇటీవల నమోదైన భారీ పెరుగుదల తర్వాత కొంత స్థిరీకరణ దశలో ఉన్నట్లు కనపిస్తోంది. గత మూడు మరియు ఆరు నెలల కాలంలో టీజీవీ ఎస్ఆర్ఏఏసీ షేర్లు 23 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు (YTD), ఈ షేరు 18 శాతం రాబడిని అందించింది. ఇది 2026లో ఇప్పటివరకు సానుకూల పనితీరును కనబరుస్తోంది. దీర్ఘకాలిక పనితీరును పరిశీలిస్తే గత ఏడాది కాలంలో టీజీవీ ఎస్ఆర్ఏఏసీ షేర్లు 13.32 శాతం, రెండేళ్ల కాలంలో 18 శాతం లాభపడ్డాయి. మరింత సుదీర్ఘ కాలంలో అంటే మూడేళ్లలో ఈ షేరు 24 శాతం వృద్ధిని సాధించింది. గత దశాబ్ద కాలంలో టీజీవీ ఎస్ఆర్ఏఏసీ షేర్లు అద్భుతమైన రాబడులను అందించాయి. ఐదేళ్లలో 147 శాతం, పదేళ్లలో 514 శాతం మేర రాబడి అందించాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications