Multibagger Stock: ఐదేళ్లలో రూ.23 నుంచి రూ.1,666 చేరిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!

భారతీయ స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన సూచీలు వరుసగా మూడవ సెషన్‌లోనూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ బలహీనమైన మార్కెట్ పరిస్థితుల్లోనూ కొన్ని షేర్లు దృఢత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అటువంటి షేర్లలో నెట్‌వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ (NPST) లిమిటెడ్ ఒకటి. ఈ రోజు ఎన్పీఎస్టీ షేర్ ధర ఎన్ఎస్ఈలో దాదాపు 8 శాతం పెరిగి రూ.1,654 వద్ద కొనసాగుతోంది. ఇంట్రాడే గరిష్ట స్థాయి అయిన రూ.1,686.90ని తాకింది. అయితే గత ఐదేళ్లలో దాదాపు 6,950 శాతం రాబడిని ఇచ్చింది.

ఇది నిన్నటి ముగింపు ధర రూ.1,537.20 (NSEలో) కంటే 8 శాతం పైగా ఎక్కువ. ఈ కంపెనీ తన Q1FY27 ఫలితాలను 2026 ఆగస్టు 11న ప్రకటించింది. Q1FY27లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.61.42 కోట్లుగా నమోదైంది. ఇది Q1FY26లోని ₹35.09 కోట్ల ఆదాయం కంటే 75.04% ఎక్కువ. నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.7.19 కోట్ల నుంచి రూ.11.05 కోట్లకు పెరిగింది. అంటే ఏడాది ప్రాతిపదికన (YoY) 53.42% వృద్ధి నమోదైంది. ఈ త్రైమాసికానికి ఎబిట్డా రూ.18.79 కోట్లుగా ఉంది. ఇది Q1FY26లోని రూ.11.31 కోట్ల కంటే ఎక్కువ.

Multibagger

ఎబిట్డా మార్జిన్ 30.59%గా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 32.23%గా ఉండేది. అంటే ఏడాది ప్రాతిపదికన సుమారు 164 బేసిస్ పాయింట్ల తగ్గుదల కనిపించింది. ఈ కంపెనీ అధిక మార్జిన్ మోడల్ కింద తన 'SuperApp' పరిష్కారం కోసం ఒక ప్రముఖ గ్లోబల్ టెలికాం ఆపరేటర్ నుండి LOI (Letter of Intent)ను పొందింది. మొదటి త్రైమాసికంలో తమ వ్యాపారమంతటా కొనసాగుతున్న పురోగతిని ప్రతిబింబిస్తుందని ఎన్పీఎస్టీ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపక్ చంద్ ఠాకూర్ అన్నారు.
పెరుగుతున్న ఆర్డర్ బుక్, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణ మద్దతుతో, మా మూడు ఆదాయ-ఉత్పత్తి విభాగాలలో మేము పురోగతిని సాధిస్తున్నట్లు చెప్పారు.

దీర్ఘకాలంలో భారత స్టాక్ మార్కెట్ అందించిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఎన్పీఎస్టీ షేర్లు కూడా ఒకటి. గత ఐదేళ్లలో ఎన్ఎస్ఈలో ఈ స్టాక్ ఒక్కో షేరుకు రూ.23.63 నుంచి రూ.1,665కు పెరిగింది. ఈ కాలంలో సుమారు 6,950 శాతం పెరిగింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+