Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రాణించిన ఐటీ షేర్లు..!

శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 261.79 పాయింట్లు పెరిగి 77,763.91 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 95.15 పాయింట్లు పెరిగి 24,270.85 వద్ద ముగిసింది. మొత్తం 2,182 షేర్లు లాభపడగా, 1,879 షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, బీఈఎల్, ట్రెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్,ఇన్పోసిస్, ఎటర్నల్ , మారుతి, రిలయన్స్, ఐటీసీ లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్, టైటాన్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఇండిగో, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్అండ్ టీ, ఎంఅండ్ఎం, ఎస్బీఐఎన్, యాక్సెస్ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి.

నిఫ్టీలో HCL టెక్నాలజీస్, మ్యాక్స్ హెల్త్‌కేర్, బజాజ్ ఫిన్‌సర్వ్, అపోలో హాస్పిటల్స్ మరియు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అత్యధిక లాభాలను ఆర్జించగా, యాక్సిస్ బ్యాంక్, M&M, SBI, L&T, టెక్ మహీంద్రా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.నిఫ్టీ రియాల్టీ 2 శాతం పరిగింది. నిఫ్టీ ఐటీ 1.7 శాతం, నిఫ్టీ ఫార్మా 1.7 శాతం, నిఫ్టీ మెటల్ 0.7 శాతం పెరిగాయి. నిఫ్టీ PSU బ్యాంక్ 1.5 శాతం పతనంతో అత్యధిక నష్టాన్ని చవిచూసింది. నిఫ్టీ ఎనర్జీ 1.30 శాతం, నిఫ్టీ ఆటో 0.4 శాతం, నిఫ్టీ మీడియా 0.4 శాతం, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.3 శాతం, నిఫ్టీ బ్యాంక్ 0.16 శాతం తగ్గింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ స్వల్ప నష్టంతో ముగియగా, స్మాల్‌క్యాప్ సూచీ దాదాపు స్థిరంగా ముగిసింది.

Stock Market

ఈ రోజు హెచ్ సీఎల్ టెక్ లో స్టాక్ 5 శాతం పెరిగింది. యూరప్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్చ్యూన్ గ్లోబల్ 50 కంపెనీ నుంచి 1.14 బిలియన్ డాలర్ల కాంట్రాక్టును హెచ్‌సీఎల్‌టెక్ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆపరేటింగ్ మోడల్‌ను ఉపయోగించి పూర్తి చేయాలి. ఈ ఒప్పందం 2026 జూలై నుంచి డిసెంబర్ 2031 వరకు కొనసాగుతుందని కంపెనీ జూలై 3న స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. అందుకే షేరు ధర పెరిగినట్లు తెలుస్తోంది. భారతదేశంలో తయారీ కేంద్రాలు కలిగిన నాలుగు చైనీస్ విద్యుత్ పరికరాల తయారీ సంస్థలను కీలకమైన విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రభుత్వ టెండర్లలో పాల్గొనేందుకు కేంద్రం అనుమతించడంతో, జూలై 3న CG పవర్, హిటాచీ ఎనర్జీ, ఇతర విద్యుత్ పరికరాల సంస్థల షేర్లు 7.5% వరకు పడిపోయాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+