Multibagger Stock: ఐదేళ్లలో 900 శాతం రాబడి ఇచ్చి న మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
బలహీనమైన మార్కెట్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్లో గాబ్రియేల్ ఇండియా షేరు ధర 7.41 శాతం పెరిగి ఎన్ఎస్ఈలో ఒక్కో షేరుకు రూ.1557.80 ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. గత వారం శుక్రవారం నాటి ముగింపు ధర రూ.1,448.90తో పోలిస్తే, గాబ్రియేల్ ఇండియా షేర్లు ఈరోజు ఒక్కో షేరుకు రూ.1,460 వద్ద ప్రారంభమయ్యాయి. షేర్ల ట్రేడింగ్ వాల్యూమ్‌లో పెరుగుదల కనిపించడంతో ఈ స్టాక్ ర్యాలీ చోటుచేసుకుంది. ఎన్ఎస్ఈలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం అక్టోబర్ 19న ఇంట్రాడే సెషన్లో సుమారు 17.34 లక్షల షేర్లు చేతులు మారాయి.
గాబ్రియేల్ ఇండియా షేర్లు పలు కాల వ్యవధులలో బలమైన కొనుగోలు ఆసక్తిని చూశాయి. గత వారంలో 7.48 శాతం పెరిగింది. గత నెలలో 13.94 శాతం పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి (YTD) గాబ్రియేల్ ఇండియా షేర్లు 44.96 శాతం లాభపడ్డాయి. కాగా గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 21.90 శాతం రాబడిని అందించింది. మూడేళ్ల కాలంలో గాబ్రియేల్ ఇండియా షేర్లు 337.35 శాతం పెరిగాయి. ఐదేళ్లలో ఈ స్టాక్ 901.33 శాతం అద్భుతమైన రాబడిని అందించింది. ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ టెక్నాలజీలపై కంపెనీ దృష్టి పెట్టడం కూడా దీర్ఘకాలిక వృద్ధికి అవకాశాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గాబ్రియేల్ ఇండియా షేరు ధరలో ఇటీవలి పెరుగుదల బుల్లిష్ మొమెంటం బలపడుతోందని సూచిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. అక్టోబర్ 12న రూ.1,460 నిరోధక స్థాయిని దాటి స్టాక్ బ్రేక్అవుట్ కావడం కొత్త కొనుగోలు ఆసక్తిని ఆకర్షించి, దాని సమీప-కాల దృక్పథాన్ని మెరుగుపరిచిందని వివరిస్తున్నారు. అక్టోబర్ 6న ఎక్స్ఛేంజ్కు సమర్పించిన ఒక ఫైలింగ్‌లో, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ మార్కెట్లో తమ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి, మాతృ సంస్థ ఆనంద్ గ్రూప్, ఫోర్వియాతో ఒక జాయింట్ వెంచర్ (JV) ఒప్పందం కుదుర్చుకున్నట్లు గాబ్రియేల్ ఇండియా తెలిపింది.
ఫౌరేసియా ఆనంద్ సీటింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పనిచేసే ఈ కొత్త జాయింట్ వెంచర్లో ఫోర్వియాకు మెజారిటీ వాటా ఉంటుంది. ఇది సీట్ ఫ్రేమ్‌లు, పూర్తి సీటింగ్ సిస్టమ్‌ల తయారీపై దృష్టి సారిస్తుంది. ఈ వెంచర్లో ఫోర్వియా 50 సాతం ప్లస్ ఒక షేరు వాటాను కలిగి ఉండగా, గాబ్రియేల్ ఇండియా 50 శాతం మైనస్ ఒక షేరును కలిగి ఉంటుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బీఎస్ఈలో లిస్ట్ అయిన గాబ్రియేల్ ఇండియా, ఆనంద్ గ్రూప్ ప్రధాన సంస్థగా ఉంది. గాబ్రియేల్ ఇండియా ఒక బలమైన దశ గుండా వెళుతోందని, విశ్లేషకులు దాని వృద్ధి ప్రయాణంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారని నమ్ముతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications